Take a fresh look at your lifestyle.

కమాండ్ కంట్రోల్ రూమ్ ఇంచార్జి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల మానిటరింగ్ చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రాలయం అం నార్త్  బ్లాక్ లో కమెండ్  కంట్రోల్ రూమ్ ని ఏర్పాటుచేసినది. కమెండ్ కంట్రోల్ రూమ్ కి ఇంఛార్జిగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల, దేశాల మధ్య 24 గంటలు సమన్వయం చేస్తుంది ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కమెండ్ కంట్రోల్ రూమ్ అని కిషన్ రెడ్డి చెప్పారు..

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకనే  సరిహద్దుల్లో నేడు విద్యార్థులకు అవస్థలు పడుతున్నారు అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమస్యలు పునరావృతం కాకుండా రెండు ప్రభుత్వాలు చూడాలి రెండు రాష్ట్రాల మధ్య ఈ సమయంలో సమన్వయం తప్పనిసరి అని ప్రజలు  లాక్ డౌన్ కి పూర్తిగా సహకరిస్తేనే క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతాం అని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలు ప్రయాణాలు చేయకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి లాక్ డౌన్ లో  ప్రయాణాలు చేయకుండా  ఎక్కడివారు అక్కడే ఉంటూ  ప్రభుత్వ సుచనలు పాటిస్తూ కరోనపై యుద్ధం చేయాలి అని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ, ఇతర పార్టీల ప్రతి కార్యకర్త, వ్యక్తి ,స్వచ్చంద సంస్థల ప్రతినిధిలు మానవత్వంతో రోజు అయిదుగురికి భోజనం అందించండి. కరోన మనల్ని చూసి పరిపోయేలా మనమందరం  ఇంట్లోనే ఉండి పోరాడదాం. లాక్ డౌన్ లో చిన్న, మధ్యతరగతి ప్రజలు ఆదుకునేందుకు మోడీగారు 1లక్ష 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ని ప్రకటించారు అని కిషన్ రెడ్డి అన్నారు.

Leave a Reply