Take a fresh look at your lifestyle.

గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలకు కిషన్ రెడ్డి సంతాపం

గురువారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ లోని విశాకపట్నంలో ఒక ప్రైవేట్ సంస్థ వద్ద గ్యాస్ లీక్ కావడంతో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. పరిస్థితిని తెలుసుకోవడానికి కిషన్ రెడ్డి స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, DGP లతో మాట్లాడానని తెలిపారు.అలాగే  అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించానని కూడా చెప్పారు. విశాఖపట్నంలో దురదృష్టకర సంఘటనలో వందలాది మంది ప్రజలు కూడా ప్రభావితమవ్వటం భాధకారమని అన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మాట్లాడి విపత్తు ప్రాంతంలో అన్ని విధాలుగా సహాయం అందించమని సూచించాను అని మంత్రి చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు సూచించటంతో, వారు క్షేత్ర స్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు అని కిషన్ రెడ్డి చెప్పారు. నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాని, అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం, రాష్ట్ర, కేంద్ర అధికారులతో సమన్వయం కొనసాగుతోంది అని చెప్పారు.ప్రస్తుతం కిషన్ రెడ్డి, విశాఖపట్టణంలో జరిగిన ప్రమాదంపై చర్చ కోసం ప్రధానమంత్రి మోదీ  ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో ఉన్నారు..

Leave a Reply