Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ‌సమావేశాల నేపథ్యంలో.. ఢిల్లీలో నేటి నుంచి ‘కిసాన్‌ ‌సంసద్‌’

  • ‌జంతర్‌మంతర్‌ ‌వద్ద నిరసనలకు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పిలుపు
  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా 8 నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం : ఆప్‌ ఎం‌పి మాన్‌

ప్రభుత్వానికి పార్లమెంటు లోపల, బయట పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతోంది. పెట్రోలు, డీజిల్‌ ‌ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై చర్చించాలంటూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఉభయ సభల్లోనూ డిమాండ్‌ ‌చేస్తుండగా, పార్లమెంటు వెలుపల రైతులు తమ నిరసన గళం తీవ్రతను మరింత పెంచబోతున్నారు. నేటి నుంచి రైతుల పార్లమెంటును జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద నిర్వహించబోతున్నారు. పార్లమెంట్‌ ‌వర్షకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ‘కిసాన్‌ ‌సంసద్‌’ ‌నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా(ఎస్‌కెఎం) నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి ప్రతి రోజు 200 మంది రైతులు జంతర్‌ ‌మంతర్‌లో కిసాన్‌ ‌సంసద్‌ ‌నిర్వహించనున్నట్లు ఎస్‌కెఎం నేతలు ఎస్‌కెఎం నేతలు బల్బీర్‌ ‌సింగ్‌ ‌రాజేవాల్‌, ‌డాక్టర్‌ ‌దర్శన్‌ ‌పాల్‌, ‌హన్నన్‌ ‌మొల్లా, జగ్జిత్‌ ‌సింగ్‌ ‌ద్లలెవాల్‌, ‌జోగిందర్‌ ‌సింగ్‌ ఉ‌గ్రహన్‌, ‌శివకుమార్‌ ‌శర్మ ’కక్కాజీ’, యుధ్వీర్‌ ‌సింగ్‌, ‌యోగేంద్ర యాదవ్‌ ‌సంయుక్తంగా ఇదివరకే ప్రకటన విడుదల చేశారు. ఈ విషమంపై ఢిల్లీ పోలీసులతో ఎస్‌కెఎం సమన్వయ కమిటీ సమావేశం అయింది.

తమ ప్రణాళికలు క్రమబద్ధంగా, క్రమశిక్షణతో, శాంతియుతంగా అమలు చేస్తామని, ఎంపిక చేసిన 200 మంది రైతులు సింఘూ బోర్డర్‌ ‌నుండి ప్రతి రోజు ఐడి కార్డులతో బయలుదేరుతారని తెలిపారు. దేశంలో ఆహార, వ్యవసాయ వ్యవస్థలపై కార్పొరేట్‌ ‌నియంత్రణకు వ్యతిరేకంగా, ప్రభుత్వం తన బాధ్యతను నుంచి తప్పుకోవడానికి వ్యతిరేకంగా, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఎస్‌కెఎం పోరాడుతుందని తెలిపారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు ఎనిమిది నెలల నుంచి ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో తమ నిరసనను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. సింఘు సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రైతు సంఘాలు రోజుకు 200 మంది చొప్పున రైతులను జంతర్‌ ‌మంతర్‌కు తరలించాలని నిర్ణయించాయి. రైతు సంఘాల నేతలు వి•డియాతో మాట్లాడుతూ, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తాము జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద రైతుల పార్లమెంటును నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి రోజూ ఓ స్పీకర్‌ను, ఓ డిప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేసుకుంటామని చెప్పారు. మొదటి రెండు రోజుల్లో ఏపీఎంసీ యాక్ట్‌పై చర్చిస్తామన్నారు. ఆ తర్వాత మిగిలిన చట్టాలపై కూడా రెండేసి రోజులపాటు చర్చిస్తామని తెలిపారు. తాము పార్లమెంటుకు వెళ్ళబోమని, జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తామని పోలీసులకు చెప్పినట్లు రాష్ట్రీయ కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌మహాసంఘ్‌ ‌నేషనల్‌ ‌ప్రెసిడెంట్‌ ‌శివ కుమార్‌ ‌తెలిపారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవారకు పోరాటం : ఆప్‌ ఎం‌పి మాన్‌
‌మూడు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు పార్లమెంటును పనిచేయడానికి అనుమతించబోమని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ‌పంజాబ్‌ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు భగవంత్‌ ‌మన్‌ ‌బుధవారం తెలిపారు. అదే సమయంలో, ఆప్‌ ఎం‌పీ కాంగ్రెస్‌పైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సభలో నలుగురైదుగురు పంజాబ్‌ ఎం‌పీలు మినహా మిగతా కాంగ్రెస్‌ ఎం‌పీలందరూ రైతులకు అనుకూలంగా మాట్లాడడానికి బదులు, రాహుల్‌కు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ భగవంత్‌ ‌మాన్‌ ‘‌కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌లాంగ్‌ ‌లివ్‌, ‌మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి’ అనే నినాదంతో వున్న ప్లకార్డును ప్రదర్శించారు.

Leave a Reply