Take a fresh look at your lifestyle.

పెరుగుతున్న పెట్రో దరలకు వ్యతిరేకంగా 8న ఆందోళన సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పిలుపు

దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా ఈ నెల8న దేశవ్యాప్త ఆందోళనలకు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య స్కూటర్లు, మోటారు సైకిళ్ళు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర వాహనాలు, ఖాళీ వంట గ్యాస్‌ ‌సిలిండర్లతో నిరసనలు తెలియజేస్తారని ఎస్‌కెఎం తెలిపింది. సంయుక్త కిసాన్‌ ‌మోర్చా నేతలు శుక్రవారం నాడిక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఘజియాబాద్‌, ‌హిసార్‌, ‌చండీగఢ్‌లలో వందలాది మంది రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని ఎస్‌కెఎం డిమాండ్‌ ‌చేసింది. మరో వైపు రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం శుక్రవారానికి 218వ రోజుకు చేరింది. ఈ పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్టాల్ర నుండి వేలాది మంది రైతులు సింఘూ, టిక్రీ, ఘాజీపూర్‌, ‌షాజాహన్‌ ‌పూర్‌, ‌పల్వాల్‌కు తరలి వస్తున్నారు.

Leave a Reply