Take a fresh look at your lifestyle.

రేపు దేశవ్యాప్తంగా ‘కిసాన్ గణ తంత్ర’ ర్యాలీ ..!

  • రాజ్ పథ్ లో పరేడ్ తరువాత రైతుల పాదయాత్ర
  • భారీ సంఖ్యలో మహిళల ట్రాక్టర ర్యాలీ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ: రైతులు కిసాన్ గణతంత్ర ర్యాలీ నిర్వహించుకోటానికి ఢిల్లీ పోలీసులు సోమవారం రైతు సంఘాల నాయకులకి “నో అబజెక్షన్” ధృవీకరణ పత్రం ఇచ్చింది. దీని ప్రకారం 5,000 ట్రాక్టర్లు మరియు 5,000 మంది రైతులు పాల్గొనవచ్చు అని అనుమతి పత్రంలో ఉంది. ర్యాలీని మధ్యాహ్నం 12 నుండి ప్రారంభించడానికి ఢిల్లీ పోలీస్ అనుమతి ఇచ్చింది. జనవరి 26 మధ్యాన్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల ర్యాలీ కొనసాగవచ్చు. రైతులు ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారుల మధ్య వారం రోజుల చర్చల తరవాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైతులు తమ ట్రాక్టర్ ర్యాలీని దేశ రాజధానిలో మూడు మార్గాలలో చేయవచ్చని నిర్ణయం జరిగింది. ఇందుకు తగిన భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేస్తారు. ఐతే రైతులకి మంజూరు చేసిన అనుమతి పట్ల రైతులకి సంతృప్తి లేదు. అందుకే కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సోమవారం ఉదయం మళ్ళీ ఢిల్లీ పోలీసులను కలవాలి అని నిర్ణయించుకుని కలిసి ఆదివారం ఇచ్చిన అనుమతి పత్రంలో కొన్ని అంశాలు మార్పించుకుంది. కిషన్ గణతంత్ర ర్యాలీకి ఇచ్చిన సమయం మార్గం నచ్చక తిరిగి తమ డిమాండ్ వినిపించడానికి పోలీసుని కలిసి పై అనుమతులు పొందారు. “ట్రాక్టర్ ర్యాలీకి మాకు ఇచ్చిన అనుమతి సరైనది కాదని మేము భావిస్తున్నాము. మేము పాత రింగ్ రోడ్‌ వైపుకి వెళ్లి ర్యాలీ చేయాలని భావిస్తున్నాం. కానీ మాకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వబడింది. అంతే కాకుండా మాకు హర్యానా పరిధిలోకి వచ్చే భాగాన్ని కేటాయించి ర్యాలీ చేసుకోమని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు,”అని సుఖ్వీందర్ సింగ్ అంటున్నారు.

దీనిపై విలేకరుల సమావేశంలో స్పెషల్ సిపి (ఇంటెలిజెన్స్) డిపేంద్ర పాథక్ మాట్లాడుతూ “మేము భారతీయ కిసాన్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపాము. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల తరువాత, రైతులు తమ పాదయాత్ర నిర్వహించుకోవచ్చు అనే ఒప్పందంకి వచ్చాం. పరేడ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని రైతులకి చెప్పాము. మేము రైతులకి తగిన భద్రత కల్పిస్తాము. వారి మార్చ్ శాంతియుతంగా జరిగేలాగా చూస్తాం. ర్యాలీ తరవాత వారు తిరిగి సరిహద్దుకు పోవాలి” అని చెప్పాం డిపేంద్ర పాథక్ తెలిపారు.

రేపటి పెరేడ్ లో మహిళా రైతులు రేపటి ట్రాక్టర్ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ‘కిసాన్ గణ తంత్రా పరేడ్’లో వందలాది మంది మహిళలు ట్రాక్టర్లను నడిపి కిసాన్ గణతంత్ర పెరేడ్ నిర్వహించాలి అని నిర్ణయించుకున్నారు. ఈ ర్యాలీ నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో అధిక భద్రత ఉన్న దేశ రాజధానిలో రైతులు ప్రవేశించటానికి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ట్రాక్టర్ ర్యాలీలో మహిళలు తమ తోటి మగ రైతులతో భుజం భుజం కలిపి ర్యాలీలో పాల్గొంటారని సామాజిక కార్యకర్త జెబా ఖాన్ తెలిపారు. ర్యాలీలో కనీసం 500 మంది మహిళలు హాజరవుతారని జెబా ఖాన్ తెలిపారు.

- Advertisement -

దేశరాజధానిలో కిషన్ గణతంత్ర పరేడ్ ఏర్పాట్లు ఇలా జరుగుతుండగా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు తమ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించే మార్గాలకు వెళ్ళవద్దు అని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఢిల్లీ వాసులను కోరారు. సింఘు, తిక్రీ, ఖాజీపూర్ సరిహద్దు పాయింట్ల నుంచి మూడు మార్గాల గుండా ‘కిసాన్ గణతంత్ర ర్యాలీ’ మొదలు అవుతుంది అని రైతు సంఘాలు నిర్ణయించాయి. ” రైతుల ట్రాక్టర్ ర్యాలీ కారణంగా ఎన్‌హెచ్ 44, జిటి-కర్నాల్ రోడ్ మరియు ఎన్‌హెచ్ 10 మార్గాలలో ప్రయాణించవద్దు అని ఢిల్లీ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోమవారం సాయంత్రం నుంచి ఈ మార్గాల్లో ట్రాఫిక్ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ ఏర్పాట్లు చేసింది.

దేశ రాజధానిలో పరిస్థితి ఇలా ఉండగా మహారాష్ట్రలో అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) మహారాష్ట్ర యూనిట్ పతాకంపై రైతులు సమీకృతం అయ్యారు. ఢిల్లీలో జరుగుతున్నా కిసాన్ గణతంత్ర ర్యాలీకి మద్దతుగా ముంబై ఆజాద్ మైదాన్ లో ధర్నా నిర్వహించనున్నారు. ఆజాద్ మైదానంలో సమావేశమై మూడు రోజుల సిట్ ఇన్ జరుగుతుంది.మహారాష్ట్రలో జనవరి 25 న రాజ్ భవన్‌కు రైతులు భారీ ర్యాలీగా వెళ్లి గవర్నర్‌కు మెమో సమర్పించలి అనుకున్నారు గవర్నర్ లేకపోవటంతో సెక్రెటరీని కలవాలి అని సూచిస్తే రైతులు అందుకు నిరాకరించారు. జనవరి 26 న, ఆజాద్ మైదానంలో రిపబ్లిక్ డే జెండా రైతులు ఎగురవేయనున్నారు.

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తమ కిషన్ గణతంత్ర పరేడ్ మాత్రమే కాకుండా ఫిబ్రవరి 1 న వార్షిక కేంద్ర బడ్జెట్ వచ్చే సమయంలో వివిధ ప్రాంతాల నుండి పార్లమెంటు వైపు కవాతు చేస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్ నుంచి కొంచం కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు అని క్రాంతికారి కిసాన్ యూనియన్‌ నేత దర్శన్ పాల్ అన్నారు.

Leave a Reply