Take a fresh look at your lifestyle.

ఉద్యమాన్ని పక్కదారి పట్టించకండి

  • వ్యవసాయ చట్ట సవరణలను తిరస్కరించిన కిసాన్‌ ‌మోర్చా
  • వ్యవసాయ శాఖకు మెయిల్‌ ‌ద్వారా స్పష్టీకరణ
  • కొనసాగుతున్న రైతుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలు రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేస్తామంటూ కేంద్రం పంపిన లిఖిత పూర్వక హావి•ని తిరస్కరిస్తూ వ్యవసాయ శాఖకు బుధవారం సంయుక్త్ ‌కిసాన్‌ ‌మోర్చా ఈ మెయిల్‌ ‌పంపింది. గత వారం చర్చల్లో భాగంగా చట్టాలకు సవరణలు చేస్తామని రైతులకు ప్రభుత్వం హావి• ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు బుధవారం ఈ మెయిల్‌ ‌ద్వారా అదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేశాయి.

రైతు ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం మానుకోవాలని, ఇతర రైతు సంఘాలతో చర్చలు జరపకూడదని సంయుక్త్ ‌కిసాన్‌ ‌మోర్చా స్పష్టం చేసింది. తమ ప్రతిపాదనలకు రైతుల నుంచి ఇంకా ఎలాంటి సమాధానం అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ ‌తోమార్‌ ‌చెప్పిన నేపథ్యంలో రైతులు ఇలా ఈమెయిల్‌ ‌ద్వారా ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. సంస్కరణల పేరుతో తీసుకువొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని వారాలుగా వివిధ రాష్ట్రాల రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Leave a Reply