Take a fresh look at your lifestyle.

స్వీయనియంత్రణ పాటించల్సిందే ఎస్‌ఐ ‌వెంకటేష

‌కుల్కచర్ల: స్వీయనియంత్రణ పాటించల్సిందేనని ఎస్‌ఐ ‌వెంకటేష్‌ అన్నారు. మండల పరిధిలోని దాస్య నాయక్‌ ‌తండా గ్రామ పంచాయతీలో తన పోలీసు సిబ్బందితో పూణే, బొంబాయి ప్రాంతం నుండి వచ్చిన వలస కూలీలు గ్రామంలో స్వీయనియంత్రణలో ఉంటున్నారా, లేదా అని ఇంటింటికి తిరిగి ఎంతమంది ఇంట్లో ఉంటున్నారని ప్రతి ఒక్కరి వివరాలను అడిగి వారి పేర్లను సేకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, మహరాష్ట్ర నుండి వచ్చిన వలస కూలీలు తాండా ప్రజలు వారితో సామాజిక దూరాన్ని పాటించి మాస్కులు ధరించాలని అన్నారు. వలస కార్మికులు ఎవరైనా స్వీయనియంత్రణ పాటించకుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. కొరోనా వైరస్‌ ‌నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ‌శంకర్‌ ‌నాయక్‌, ఉప సర్పంచి రాజు, వార్డు సభ్యులు బాల్‌ ‌సింగ్‌, ఆశా వర్కర్‌ ‌నరసమ్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags: Sarpanch Shankar Nayak, King of Sub-Serpents, Ward members Bal Singh, Asha Worker

Leave a Reply

error: Content is protected !!