Take a fresh look at your lifestyle.

ఖరశేఖర..!

కరోనా రోగానికి ఎవరైనా ఒకటే..!
కమ్యూనిస్టు, కాపిటలిస్టు, లెనినిస్టు, మార్క్సిస్టు, మావోయిస్ట్
‌క్రైస్తవులు, షియాలు, సున్నీలు, చతుర్వర్ణాలు, కులాలు, గణాలు
ఆస్తికులు, నాస్తికులు, అన్ని రకాల పార్టీలు, అన్నీ ఒకేగాటన కట్టేసి
ఓటేసినా వేయకున్న కాటేసేదే కరోనా, కళ్లు తెరచి చూడరా ఖరశేఖరా

దేవుడి పేర దోచుకునే దొంగలు, చంపుకునే నరహంతలు నియంతలు
అన్ని మతాలు ఒక్కటంటే సెక్యులరిజమే ఒక రోగమనే రోగిష్టులు
మనుషులై మసలండిరా అంటే మహాత్మునే చంపిన నీచ శక్తులు
కరోనా కాటేస్తున్నా బుద్ధిరాని బడుద్ధాయిలదేరా మెజారిటీ ఖరశేఖరా

కాళ్లు కడిగితేనే ఇంట్లో అడుగు పెట్టమనే అమ్మమ్మలు నానమ్మలు
వాకిలిలో అలికిన ఆవుపేడ, గడపనిండా రాసిన పసుపు కుంకుమలు
రాత్రే కడిగిన వంట ఇంట్లో స్నానం చేసి పొయ్యివెలిగించే మా అమ్మ,
సంధ్యలో నాన్న ఇచ్చిన అర్ఘ్యంతో కరుణించే సూరీడుని చూడరా ఖరశేఖరా

షేక్‌ ‌హాండ్‌ ‌కట్టిపెట్టి, నమస్తే మొదలు పెట్టి, చెప్పులను బయటపెట్టి
వాకిట్లో కాళ్లు కడిగి, గడపదాటి బట్టలుతికి, స్నానం తరువాత పంచెగట్టి
క్రమశిక్షణకు, నియమాలకు నిబద్దతకు బద్దుడవై, శుద్ధుడవై బుద్ధుడవై
కదిలితేనే నీకు బతుకని కరోనా చెబుతున్నది వినరా ఖరశేఖరా

ద్వేషం మాని, రోషం మాని, అహంకారం మాని, మతాల దంధా మాని
మనిషి వైతే చాలురా, మానవత్వం లేకుండాపోవడమే అసలైన వైరసు రా,
వేళ్ల దాకా నింపుకున్ననీ వైరం, మెదడులేని దుర్మార్గం, మందులేని రోగం రా,
నిన్ను నిండాముంచే నక్కలను నమ్మే నీవేరా గాడిదవు, నిజముగ ఖరశేఖరా

 మాడభూషి శ్రీధర్‌, ‌న్యాయ శాస్త్ర ఆచార్య

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!