Take a fresh look at your lifestyle.

కారు దిగనున్న ఖమ్మం టీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత ?

ఇప్పటికే అనుచరులకు స్పష్టమైన సంకేతాలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి 22 : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ టీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత ఆ పార్టీకి గుడ్‌ ‌బై చెప్పనున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌ అధినేతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ నేత పార్టీకి గుడ్‌ ‌బై చెప్పే అంవంపై ఇప్పటికే తన అనుచరులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. గతంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా అధికార పార్టీ నేతగా ప్రాతినిద్యం వహించిన ఆ నేత జిల్లాలో పార్టీపరంగా తనకు పూర్తిగా ప్రాధాన్యం తగ్గిందని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికలలో తనకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన నేతకు టీఆర్‌ఎస్‌ ‌టికెట్‌ ఇవ్వడమే కాకుండా గెలిచిన అనంతరం ఆయనను ఏకంగా లోక్‌సభలో పార్టీ పక్షనేత హోదాను సైతం కల్పించారు. అసలే తనకు వ్యతిరేకంగా ఉన్న నేతను పార్టీలోకి తీసుకోవడం, లోక్‌సభలో సైతం కీలక పదవిని అప్పజెప్పడంతో సదరు నేత పార్టీ అధినేతపై గత కొంత కాలంగా అలకబూనారు.

ఇటీవల జరిగిన ప్రజాప్రతినిధుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అధికారికంగా నిలబెట్టిన అభ్యర్థికి రావాల్సిన వోట్లకన్నా తక్కువగా వచ్చాయి. ఎమ్మెల్సీగా అధికార పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ తనకు రావాల్సిన వోట్ల కంటే తక్కువ రావడానికి సదరు అసమ్మతి నేత కారణమని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసీఆర్‌ ‌సదరు అసమ్మతి నేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామంపై అసమ్మతి నేత సీఎం కేసీఆర్‌కు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా, పార్టీ మారడానికి నిర్ణయించుకున్న నేత తన అనుచరులకు దీనిపై స్పష్టత ఇచ్చారనీ, తాను చేరదల్చుకున్న పార్టీలోకి వెళ్లాలని వారికి సూచించారని కొద్ది రోజుల వ్యవధిలో తాను కూడా పార్టీ మారతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

Leave a Reply