Take a fresh look at your lifestyle.

ఖమ్మం బాలికకు మెరుగైన వైద్యం అందించాలి..భట్టి

ఖమ్మంలో మృగాళ్ల పాశవిక దాడిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉస్మానియా దవాఖాన లో చికిత్స పొందుతున్న బాలికను గురువారం నాడు భట్టి విక్రమార్క కలిసి ఆరోగ్యం, ఇతర పరిస్థితులు గురించి ఆరా తీశారు. ఆస్తమా, కాలిన గాయాలతో బాధపడుతున్న బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించాలని భట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక బాలిక వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని అన్నారు.

Leave a Reply