Take a fresh look at your lifestyle.

ధన్వంతరి రూపంలో ఖైరతాబాద్‌ ‌గణేషుడు ఈసారి ఎత్తు 27 అడుగులే…

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకున్న ఖైరతాబాద్‌ ‌గణేషుడు ఈ ఏడాది ధన్వంతరి రూపంలో దర్శనమివ్వనున్నారు. కొరోనా నేపథ్యంలో ఈసారి గణేషుడు కేవలం 27 అడుగుల ఎత్తుకే పరిమితం కానున్నాడు. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో కొరోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతుండటంతో ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో గణేషుడు భక్తులకు కనువిందు చేయనున్నాడు. ప్రతీ ఏడాది ఖైరతాబాద్‌ ‌గణేషుని విగ్రహాన్ని మలచే శిల్పి  రాజేంద్రన్‌ ‌కూడా ఈ సారి గణనాథుని విగ్రహాన్ని రూపొందించనున్నారు.

కొరోనా వైరస్‌తో ప్రస్తుతం దేశమంతా భయంకర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా త్వరగా వ్యాక్సిన్‌ ‌వచ్చేలా భగవంతుడి ఆశీస్సులు కోరుతూ ధన్వంతరి రూపంలో  ప్రతిష్టించనున్నామనీ, విగ్రహం తయారు చేయడానికి కావలసిన మట్టిని గుజరాత్‌ ‌నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో కొరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఒక్క అడుగు విగ్రహాన్నే రూపొందించాలని ఉత్సవ నిర్వాహకులు భావించారు. అయితే, భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాజాగా 27 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ఉత్సవ నిర్వాహకులు ప్రకటించారు.

Leave a Reply

error: Content is protected !!