Take a fresh look at your lifestyle.

ఎపి కేబినేట్‌ ‌పలు కీలక నిర్ణయాలు

  • వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ
  • రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌  
  • కొత్తగా జైన్‌ ‌కార్పొరేషన్‌, ‌సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటు
  • నిర్ణయాలను డియాకు వెల్లడించిన మంత్రి పేర్ని నాని

అమరావతి,అక్టోబర్‌ 28 : ‌వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అం‌దించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం తెలపింది.సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని డియాతో మాట్లాడారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి అన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. అర్హత ఉన్నవారందరికీ సంక్షేమపథకాలు అందిస్తాం అని తెలిపారు. అంతేకాక బీసీ జనగణన చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపామన్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించా మన్నారు. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదు అని మంత్రి పేర్ని నాని తెలిపారు. యూనిట్‌కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ ‌కొనుగోలు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కేబినెట్‌ ఆమోదం.

2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు ఆమోదించారు.  అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదిస్తూ కొత్తగా జైన్‌ ‌కార్పొరేషన్‌, ‌సిక్కు కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో 5 చోట్ల సెవన్‌ ‌స్టార్‌ ‌పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం లభించింది. విశాఖలో తాజ్‌ ‌వరుణ్‌ ‌బీచ్‌ ‌ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేబినెట్‌,‌జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  అమ్మఒడి పథకానికి అర్హత ఉన్న వారందరికీ జూన్‌, ‌డిసెంబర్‌లో అర్జీకి అవకాశం కల్పిస్తామన్నారు. వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాలకు ఆమోదం ఇచ్చారు. కొత్తగా 1,285 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అం‌గీకారం తెలిపింది.

560 అర్బన్‌ ‌హెల్త్ ‌క్లినిక్స్‌లో ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. వైద్య కళాశాలల్లో 2,190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం ఇచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 4,035 కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం ఇవ్వగా, వైద్య ఆరోగ్యశాఖలో 41,308 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా ఉంటే.. ఇప్పటివరకు 26,197 ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి తెలిపారు. రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ అం‌దించేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం ఇచ్చింది. అనంతపురం జిల్లాలో వేద పాఠశాల, సంస్క•త పాఠశాల ఏర్పాటుకు ఆమోదం ఇచ్చారు. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపుకు ఆమోదం. ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం ఇచ్చారని పేర్ని నాని తెలిపారు.

Leave a Reply