Take a fresh look at your lifestyle.

పరీక్షలన్నీ పూర్తయ్యాకే ‘కీ’

  • తొలిరోజు ప్రశాంతంగా సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు
  • 634 మంది కోవిడ్‌ అనుమానితులకు ఐసోలేషన్‌ ‌గదుల్లో పరీక్ష

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో గాలకోసం ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో మొత్తం వారంపాటు జరిగే ఈ పరీక్షలన్నీ పూర్తయ్యాకే అన్నిటికీ కలిపి ఒకేసారి ‘కీ’ విడుదల చేసే వీలుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 19 కేటగిరీలలో పార దర్శకంగా 16,208 ఉద్యోగాల భర్తీకి చేపట్టిన ఈ పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 26 వరకు రోజుకు రెండేసి చొప్పున పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటిరోజు జరిగిన పరీక్షలకు 6,81,664 మంది దరఖాస్తు చేసుకోగా 5,06,386 మంది హాజరయ్యారు. రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ‌గిరిజాశంకర్‌ ‌తెలిపారు.

పోటాపోటీగా…
ఆదివారం ఉదయం జరిగిన పరీక్షలో ఒక్కో ఉద్యోగానికి 332 మంది చొప్పున రాతపరీక్షల్లో పోటీపడగా సాయంత్రం జరిగిన పరీక్షల్లో ఒక్కో ఉద్యోగానికి 147 మంది చొప్పున పోటీపడ్డారు.
? 1,025 పోస్టులకు ఆది వారం ఉదయం జరిగిన పరీక్షలకు 4,56,997 మంది దరఖాస్తు చేసుకోగా 4,08,687 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ ‌చేసు కున్నారు. వీరిలో 3,40,386 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. 2,221 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ? సాయంత్రం పరీక్షలకు 2,24,667 మంది దరఖాస్తు చేసుకోగా, 2,02,998 మంది హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ ‌చేసుకున్నారు. వీరిలో 1,65,922 మంది 1,059 కేంద్రాల్లో పరీక్షకు హాజరయ్యారు.

వారికి ఐసోలేషన్‌ ‌గదుల్లో పరీక్షలు..
తొలిరోజు 634 మంది కరోనా అనుమానిత లక్షణాలున్న అభ్యర్థులు హాజరవగా.. వీరికి ప్రత్యేకంగా ఐసోలేషన్‌ ‌గదుల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ అనంతరం అభ్యర్థులను లోపలకు అనుమతించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply