Take a fresh look at your lifestyle.

కేరళను రుతుపవనాలు తాకాయన్న స్కైమేట్‌

  • 1‌న తాకుతాయంటున్న భారత వాతావరణ విభాగం
  • అక్కడక్కడా వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు

దేశానికీ చల్లటి వార్త వెలువడింది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రైవేట్‌ ‌వాతావరణ సంస్థ స్కైమెట్‌ ‌పేర్కొంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా కంటే రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి. జూన్‌ 1 ‌న రుతుపవనాల రాక గురించి ఐఎండి రెండు రోజుల కిందట ప్రకటన చేసింది. ఈసారి రుతుపవనాలు సగటున ఉండబోతున్నాయని వాతావరణ శాఖ ఏప్రిల్‌లో తెలిపింది. ఈసారి 96 నుండి 100శాతం వర్షపాతం నమోదైతే సాధారణ రుతుపవనాలుగా పరిగణించబడుతుంది. గతేడాది ఎనిమిది రోజుల ఆలస్యంతో జూన్‌ 8 ‌న కేరళ తీరాన్ని తాకాయి.. జూన్‌ , ‌సెప్టెంబర్‌ ‌మధ్య నైరుతి రుతుపవనాల ద్వారా భారతదేశంలో వర్షాలు కురుస్తాయి. ఇదిలావుంటే రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్‌ ‌ప్రాంతం, నైఋతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం, తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన ఉందన్నారు. జూన్‌ 1‌న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, చత్తీస్‌గఢ్‌ ‌ప్రాంతంలో 2 కిలోటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.

తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ దుగా ఉపరితల ద్రోణి ఏర్పడనుంది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆదివారం కొన్నిచోట్ల.. సోమవారం చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అక్కడక్కడా కురినిస వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దక్షిణ తమిళనాడు, తెలంగాణ దుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మరోవైపు పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని అనుకుని తూర్పు మధ్య ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్‌ 1‌వ తేదీనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy