Take a fresh look at your lifestyle.

రాష్ట్ర క్యాబినెట్‌లోకి కేరళ ఐపిఎస్‌ అధికారి లక్ష్మణ్‌!

Kerala ,IPS officer, Laxman,state cabinet,telangana

  • ఐటీశాఖ మంత్రిగా నియమించేందుకు
  •  సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయం?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోకి అనూహ్యంగా ఒక కేరళ ఐపిఎస్‌ అధికారి రానున్నారు. 1997 ఐపీఎస్‌ ‌బ్యాచ్‌ ‌కేరళ క్యాడర్‌కు చెందిన జీ లక్ష్మణ్‌ ‌ప్రస్తుతం అదే రాష్ట్రంలో పోలీస్‌ ఐజీగా పనిచేస్తున్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిర్ణయించారు.ఈ విషయం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు తెలియజేయగా అయన అందుకు అంగీకరించినట్లు సమాచారం. దరిమిలా లక్ష్మణ్‌   ఐజీ పదవికి రాజీనామా చేసి త్వరలోనే క్యాబినెట్‌లో చేరే అవకాశం ఉంది. అంతేకాదు ఆయనకు ఏశాఖ ఇచ్చేది కూడా ఖరారైందంటున్నారు. ఆయనను ఐటీశాఖ మంత్రిగా నియమించేందుకు నిర్ణయం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న లక్ష్మణ్‌ ఈ ‌నేపథ్యంలో కేరళకు వెళ్లి పదవికి రాజీనామా చేసి రెండు రోజుల్లో తిరిగిరానున్నారు. తనకు ఐటీ శాఖ కేటాయించాలని సీఎం కేసీఆర్‌ ‌భావిస్తున్నట్లు తనకు సమాచారం ఉందని లక్ష్మణ్‌  ‌చెప్పారు. 46 ఏండ్ల వయసున్న లక్ష్మణ్‌కు ఇంకా 14 ఏండ్ల పాటు పోలీస్‌ ‌సర్వీసులో కొనసాగే అవకాశం ఉన్నా దానిని వదలుకొని ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చేరనున్నారు. ఇప్పటికే లక్ష్మణ్‌ ‌దగ్గరి బంధువులు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

లక్ష్మణ్‌కు కూడా లోగడ రాజకీయ అవకాశాలు వచ్చాయి. 2009, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు ప్రతిపాదనలు వచ్చినా ఆయన అప్పుడు ఐపీఎస్‌ ‌వదులుకుని రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడలేదు.  ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మణ్‌ ‌మొదట కేరళలోని అలప్పుళలో ఏఎస్‌పీగా చేరి అంచెలంచెలులగా ఐజీ స్థాయికి చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ డీజీపీ డీటీ నాయక్‌ ‌కుమార్తె డాక్టర్‌ ‌కవితను లక్ష్మణ్‌ ‌వివాహం చేసుకున్నారు. కేరళ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులు పోలీస్‌శాఖలో ఉన్నత పదవులు వీడి  రాజ్యాంగ పదవులు చేపట్టడం ఇదేం కొత్తకాదు. ఇదివరకు అక్కడ డీజీపీగా ఉన్న ఆర్‌ఎస్‌ ‌ముషారీ తరువాత  మేఘాలయ గవర్నర్‌గా పని చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply