Take a fresh look at your lifestyle.

ఎన్‌సీసీకి వ్యతిరేకంగా.. కేరళ అసెంబ్లీ తీర్మానం

Kerala Assembly Resolution Against NCCపౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ.. ఈ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌తీర్మానం ప్రవేశ పెట్టారు. కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోవని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయన్‌ ‌మాట్లాడుతూ.. లౌకికవాదానికి రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నదని ఆయన పేర్కొన్నారు. తాజా చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో… అంతర్జాతీయ సమాజం ముందు భారత ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని సీఎం ఆరోపించారు.

కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోమని నేను స్పష్టం చేస్తున్నానని అన్నారు. లౌకికవాదానికి కేరళలో సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, ప్రతి ఒక్కరూ మా గడ్డపైకి వచ్చారు. తొలినాళ్లలోనే కేరళకు కైస్త్రవులు, ముస్లింలు వచ్చారని, కలుపుకొని పోవడమే మా సంప్రదాయం అన్నారు. ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మన శాసన సభపై ఉందని సీఎం విజయన్‌ ‌పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆరెస్సెస్‌ అజెండాను అమలు చేస్తోందనీ, అందులో భాగంగానే మత ప్రాతిపదికన దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా సీఏఏను తీసుకొచ్చిందని సీఎం ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ప్రాధమిక సూత్రాలు, విలువలకు ఈ చట్టం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. సీఏఏని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి కాంగ్రెస్‌, ‌సీపీఐ సభ్యులు మద్దతు ఇవ్వగా… బీజేపీ ఏకైక సభ్యుడు మాత్రం అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే సీఏఏ చట్టానికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపినందున ఇలా తీర్మానం చేయడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

Tags: Kerala Assembly, Resolution, Against NCC, bjp mla, caa

Leave a Reply