నిజానికి గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్, బీజేపీలు రెండింటిపైనా సమాన స్థాయిలో విమర్శలు గుప్పించారు. నరేంద్రమోడీ తీసుకునే ప్రతి చర్యలోనూ లోపాలను ఎత్తి చూపేవారు. కుట్రను వెదికేవారు. ఆయన ఇప్పుడు మునుపటి మాదిరిగా లేరు. ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూ కనిపిస్తున్నారు. కేంద్రం మీద వ్యాఖ్యలు చేయాల్సి వొస్తే ఆచితూచి వ్యవహ రిస్తున్నారు. కేజ్రీవాల్లో ఈ మార్పు చూసి ఢిల్లీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఆయనలో ఈ మార్పు కనిపిస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ(ఆప్) సారథి అరవింద్ కేజ్రీవాల్లో ఇప్పుడు కొత్త వ్యక్తిని చూస్తున్నాం. ఆయనలో గతంలో మాదిరి ఆవేశ కావేశాలు లేవు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద దూకుడుగా విమర్శలు లేవు. ఆయన ఇప్పుడు కేంద్రంపై నిప్పులు చెరగడం లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనలో కనిపిస్తున్న ఈ మార్పు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్, బీజేపీలు రెండింటిపైనా సమాన స్థాయిలో విమర్శలు గుప్పించారు. నరేంద్రమోడీ తీసుకునే ప్రతి చర్యలోనూ లోపాలను ఎత్తి చూపేవారు. కుట్రను వెదికేవారు. ఆయన ఇప్పుడు మునుపటి మాదిరిగా లేరు. ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూ కనిపిస్తున్నారు. కేంద్రం మీద వ్యాఖ్యలు చేయాల్సి వొస్తే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కేజ్రీవాల్లో ఈ మార్పు చూసి ఢిల్లీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఆయనలో ఈ మార్పు కనిపిస్తోంది. మరో నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయన వైఖరిలో మార్పునకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సలహాలే కారణమేమో. డిసెంబర్ 20వ తేదీన ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు, ఆయన ప్రచారంలో గతంలో మాదిరి ఇప్పుడు విమర్శలూ, ఆరోపణలూ, తొందరపాటు వ్యాఖ్యలూ లేవు. ఆయన కేంద్రంపై సున్నితమైన విమర్శలు చేస్తున్నారు. సానుకూల ధోరణిలో ప్రచారాన్ని నిర్వహించాలన్నది ప్రశాంత్ కిషోర్ సలహా అయి ఉంటుంది.
ఢిల్లీలో అధికారంలోకి వొచ్చిన తర్వాత తమ పార్టీ చేపట్టిన, ఇప్పటికీ కొనసాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఆయన జనానికి బోధపర్చే రీతిలో ఎంతో ఓపికతో చెబుతున్నారు. సభల్లో మైకు పని చేయకపోయినా చిరాకు పడటం లేదు. సభకు హాజరైన వృద్ధురాలైన మహిళ వేదిక ఎక్కేందుకు చెయ్యి అందించడం వంటి సానుకూల వైఖరులను ప్రదర్శిస్తున్నారు. కేజ్రీవాల్ స్వగతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనీ, తానే ప్రశ్న వేసుకుని తానే సమాధానమిస్తున్నారని ఆప్ కార్యకర్త ఒకరు మిడియాకు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, తన ప్రభుత్వం సాధించిన, అమలు జరిపిన కార్యక్రమాలతో ప్రజల ముందుకు ప్రచారానికి వచ్చారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 70 ఏళ్ళ స్వతంత్ర పాలనలో ఎన్నో ప్రభుత్వాలను ప్రజలు చూశారు. తన ప్రభుత్వంలోని కొత్త దనాన్ని చూస్తున్నారు కనుక తాము చేసిన పనుల ఆధారంగా వోట్లు వేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సానుకూల ధోరణిలో వోట్లు అడిగితే ప్రజల నుంచి మంచి స్పందన వొస్తుందని ఆయన భావిస్తున్నారు. డిసెంబర్ 30వ తేదీన దుర్గాపురి చౌక్‌లో కేజ్రీవాల్ సభ ఏర్పాటైన సమయంలో సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా బయటవారెవరో నినాదాలు చేశారు. వారిని గురించి కేజ్రీవాల్ అసలు పట్టించుకోలేదు.
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో దేనినీ ఆప్ అమలు జేయలేదంటూ బీజేపీ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, తమ ప్రభుత్వం చేపట్టిన, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై గతంలో తీవ్రంగా విమర్శించిన కేజ్రీవాల్ ఇప్పుడు మోడీ గురించి పల్లెత్తు మాట అనడం లేదు. కేజ్రీవాల్లో వచ్చిన ఈ మార్పను ప్రజలు గుర్తించారనీ, ఆయన సానుకూల ధోరణిని మెచ్చుకుంటున్నారని సంజయ్ కుమార్ అన్నారు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలెపింగ్ సొసైటీస్(సిఎస్‌డిఎస్)కి చెందిన రాజకీయ వ్యాఖ్యాతగా సంజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఆయనలో వొచ్చిన మార్పును జనం గ్రహించారు. ఆయన ఇప్పుడు హీరోలా జనానికి కనిపిస్తున్నారని సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో కేజ్రీవాల్ జరుపుతున్న సానుకూల ప్రచారం జనాన్ని ఆకట్టుకుంటోంది. కేజ్రీవాల్లో ప్రజలు ఇప్పుడు ఒక నాయకుణ్ణి చూస్తున్నారనీ, తమ సమస్యలను పరిష్కరించే సత్తా ఆయనకు ఉందని నమ్ముతున్నారని సంజయ్ కుమార్ అన్నారు. అంతేకాక, ఆయన ఎల్ల వేళలా జనానికి అందుబాటులో ఉంటారనీ, ఆయనలో జనానికి నచ్చిన ప్రధాన లక్షణం అదే నని సంజయ్ కుమార్ అన్నారు.
– ‘ద ప్రింట్’ సౌజన్యంతో..
Tags: latest article, delhi cm, kejtiwal new campaign, csds, sanjay kumar