Take a fresh look at your lifestyle.

కోటి లంచం కేసులో.. కీసర ఎమ్మార్వో సహా నలుగురి అరెస్ట్

అరాచకాలపై రైతుల ఆందోళన చర్యలు తీసుకోవాలని మాజీ అధికారి డిమాండ్‌

మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లాలో 28 ఎకరాల ల్యాండ్‌ ‌సెటిల్మెంట్‌ ‌కోసం రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యక్తుల నుంచి రూ.2 కోట్లు డిమాండ్‌ ‌చేసి, రూ.1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ కీసర తహసీల్దార్‌ ‌నాగరాజు ఏసీబీ అధికారులకు రెడ్‌ ‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ కేసులో శనివారం కీసర ఎమ్మార్వో నాగరాజుతో పాటు మరో ముగ్గురు నిందితులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌, ‌సాయిరాజ్‌లను అరెస్ట్ ‌చేశారు. వారిని నాంపల్లి ఏసీబీ
కార్యాలయం నుండి వైద్యపరీక్షలకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో 1.10 కోట్లు లంచంగా తీసుకుంటూ రెడ్‌ ‌హ్యండెడ్‌గా మేడ్చల్‌ ‌జిల్లా కీసర మండలం ఎమ్మార్వో పట్టుబడ్డాడు. ఓ వివాదాస్పద భూమికి కొందరికి అనుకూలంగా పాస్‌ ‌పుస్తకాలు ఇచ్చేందుకు ఈ లంచం తీసుకున్నాడు. అతని వద్ద లభించిన మరో రూ.25 లక్షలు అవినీతి సొమ్మును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అతని ఆస్తులు కూడా.. రూ.100 కోట్లు పైనే ఉన్నట్టు సమాచారం. ఆ ఎమ్మార్వో బాధితుడైన ఓ మాజీ విజులెన్స్ అధికారి, ఎస్‌ ‌పి సురేందర్‌ ‌రెడ్డి శనివారం డియాతో మాట్లాడుతూ.. రాంపల్లి దాయర లోని సర్వే నెంబర్‌ 614 ‌లో తన పొలం 5.5 గుంటలని.. తాను 2018 లో దుర్గా రెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసినట్టు తెలిపారు. దౌర్జన్యంగా ఎటువంటి నోటీస్‌ ఇవ్వకుండా తన భూమి హద్దులను ఎమ్‌.ఆర్‌.ఓ ‌డిమోలిష్‌ ‌చేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు.. ఎమ్‌ఆర్‌వో తన సొంత నిధులతో కాంపౌండ్‌ ‌నిర్మించాడని చెప్పారు. స్థానికంగా ఉన్న కొంత మంది రియల్టర్లతో కలిసి పలుమార్లు ఇబ్బందులకు గురిచేశాడని..చివరకు తన భూమికి సంబంధించి కొత్త పాస్‌ ‌బుక్‌లు వచ్చినా..తన చేతికి ఇవ్వకుండా పాస్‌ ‌బుక్‌ ‌రద్దుకు ఆదేశించాడని చెప్పారు. ఎమ్‌ఆర్‌ఓ ‌నాగరాజుపై పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు, జాయింట్‌ ‌కలెక్టర్‌కు, ఆర్‌డిఓ ఇలా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించలేదని మాజీ ఎస్పీ సురేందర్‌ ‌రెడ్డి తెలిపారు. కోట్ల విలువ చేసే విలువైన భూమిని రియల్టర్లు రైతులను మభ్యపెడుతూ..అందిన కాడికి దోచుకుంటున్నారని అన్నారు. అవినీతి ఎమ్‌ఆర్‌ఓ ‌నాగరాజు, అతనికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు.

ఎమ్మార్వో తీరుకు రైతుల ఆందోళన
కీసర తహసీల్దార్‌ ‌నాగరాజు అండతో ప్రైవేట్‌ ‌వ్యక్తులు తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారంటూ శనివారం రాంపల్లి దాయర వద్ద రైతులు ఆందోళన చేశారు. ఎన్నో సంవత్సరాలుగా తాతల నాటి భూమిలొనే వ్యవసాయం చేసుకుంటున్నామని..అయితే ఈ మధ్య కొందరు మా భూముల వద్దకు వచ్చి, కొనుగోలు చేశామని బెదిరించారని చెబుతున్నారు. దీనిపై కోర్టులో కేసులు ఉన్నకారణంగా అమ్మడం.. కొనుగోళ్లు జరగవు అనే నమ్మకంతో ఉంటున్నామని తెలిపారు. అయితే ఏసీబీ దాడులతో కీసర తహసీల్దార్‌ అవినీతి తెలియడంతో..న్యాయం కోసం పోరాటం చేస్తామంటున్నారు. మా భూమి మాకు చెందుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో చాలా మంది పాత్రలు ఉన్నాయని..ఇన్ని రోజులు పాస్‌ ‌పుస్తకాలు ఇవ్వమంటే తహసీల్దార్‌ ‌కోర్టు కేసు ఉందని ఇవ్వలేదని తెలిపారు. భూముల వ్యవహారంపై చాలా కాలంగా కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు రైతులు.

Leave a Reply