Take a fresh look at your lifestyle.

పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి: చైర్‌పర్సన్‌

‌సూర్యాపేట, సెప్టెంబర్‌3, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రజలు పట్టణానికి వస్తుంటారు కావున అందరికి అందుబాటులో ఉండేలా పట్టణంలోని 10ప్రధాన కూడమిలో పబ్లిక్‌ ‌టాయిలెట్స్‌ల నిర్మాణం చేపట్టడం జరిగిందని మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని 7వ వార్డు భిమారం క్రాస్‌ ‌రోడ్డు నందు, 1వ వార్డులో కుడకుడ గంగ దేవమ్మ గుడి ప్రాంతం ప్రక్కన పబ్లిక్‌ ‌టాయిలెట్స్‌ను ప్రారంభించి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ‌రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాలమేరకు స్వచ్ఛ సూర్యాపేటలో భాగంగా పబ్లిక్‌ ‌టాయిలెట్స్‌ను ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సూర్యాపేట పట్టణంలో రోజురోజుకు అభివృద్ది చెందుతుందని కావున కొన్ని వేల మంది పట్టణానికి వచ్చి పోతుంటారని ప్రతి ఒక్కరూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పి.రామాంజుల రెడ్డి, వార్డు కౌన్సిలర్లు వేములకొండ పద్మ, కుంభం రేణుక, రాజేందర్‌, ‌సత్యరాజ్‌, ‌సుమంత్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply