Take a fresh look at your lifestyle.

తుపాకీ రాముడిలా కేసీఆర్‌ ‌మాటలు

  • పక్క రాష్ట్రంతో నీళ్ల సమస్యను పరిష్కరించుకోలేని అసమర్థుడు
  • తెరవెనుక ఇతర పార్టీకి మద్దతునిస్తున్న భారాస
  • మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 9 : బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి తాను దిల్లీ  అంట..ఎవరు ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ ‌మాత్రం చంచల్‌ ‌గూడా జైలుకు వెళ్లడం ఖాయం..అని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో బుధవారం ఖమ్మంలో జరిగిన భారతీయ్‌ ‌రాష్్ర‌ ‌సమితి బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ ‌ప్రసంగాన్ని తుపాకీ రాముడి మాటలతో పోలుస్తూ ..దేశం గురించి ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడొచ్చు కానీ కెసిఆర్‌ ‌మాట్లాడితే  చాలా ఆశ్చర్యం వేస్తుంది..మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుపుకున్నాం..కెసిఆర్‌ ‌బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలు సంక్రాంతి పండుగ రోజు ఆధునిక తుపాకి రాముడు మాట్లాడిన మాటల్లా ఉన్నాయి.. అని పేర్కొన్నారు. ఆధునిక యుగంలో తుపాకీ రాముడు ఎట్లా ఉన్నాడు అని గుర్తుకు వొచ్చిందన్నది తాను ముందు చెప్పానని తెలుపుతూ ..దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కూటిలో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీశాడు అంట అలా ఉంది కేసీఆర్‌ ‌తీరు.

కెసిఆర్‌ ఇచ్చిన హామీల పైన ఎప్పుడైనా చర్చకి వొచ్చాడా..కెసిఆర్‌ అవినీతి బాగోతలు బయటపడతాయి. ఈయన దేశం బాగు కోసం మాట్లాడతాడా…కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ‌దేశ విషయాల మీద ఏనాడైనా ఎప్పుడైనా స్పందించాడా..అవకాశాలను ఆసరాగా చేసుకుని అవినీతికి పాల్పడ్డ   కేసిఆర్‌కు దేశం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సొంత ఊరులో చెరువు బాగు చేయించుకోలేని వాడు కేసిఆర్‌…ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుంటున్న కేసీఆర్‌ ‌బిజెపి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ప్రపంచ బ్యాంకు నుండి డబ్బులు తీసుకువచ్చే సంగతి నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు ఎప్పుడు తీసుకొస్తారు నీకు తెలుసా  అని ప్రశ్నిస్తూ రాష్ట్రాలని దేశాన్ని అప్పుల పాలు చేస్తున్న సమయంలో ఇప్పుడు ముందుకు వొచ్చి అప్పులు తీసుకోకూడదని మాట్లాడుతున్నాడు కేసీఆర్‌…అన్నారు. దేశ వ్యాప్తంగా దళితులకు 25 లక్షల మందికి ఇస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేసీఆర్‌, ‌మోడీ గురువింద నీతులు చెబుతున్నారు.

సుమారు 5 లక్ష కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశావ్‌ ‌నువ్వా మాట్లాడేది..రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే ఇప్పటికి ఎంత మందికి దళిత బంధు ఇచ్చావు.. 30 వేల మందికా ఇచ్చేది…ఎన్నికల ముందు మాట్లాడిన మూడెకరాల భూమి ఎంతమందికి ఇచ్చావు..ప్రపంచంలోనే నాలుగో దేశంగా అత్యంత ఎక్కువ ఆహార ధాన్యాలు ఎగుమతి.జరుగడా లేదా ? 128 దేశాలకి ఎగుమతి చేస్తున్నాం..అని పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. విలేఖరుల సమావేశంలో …5 ఎకరాలు ఉన్నాయి..24 గంటల కరెంట్‌ ‌రావట్లేదు. 11 నుంచి 12 గంటలు మాత్రమే ఇస్తున్నారు.. అని  కొండి శ్రీనివాస్‌, అనే  రైతు..ఫోన్లో మీడియాకు తెలిపారు. ‘‘నల్గొండను ఫ్లోరైడ్‌ ‌రహితంగా కాంగ్రెస్‌ ‌పార్టీ  చేసింది..మిషన్‌ ‌భగీరథ నీళ్లు 20 నుంచి 30 నిమిషాలు కూడా రావట్లేదు.

అదీ మంచి నీరు రావట్లేదు..మిషన్‌ ‌భగీరథ కోసం 40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు తాగలేని దుస్థితి..ఎనిమిదన్నరేళ్లుగా నీటి పంచాయతీలు ఏమి తేల్చావు. పక్క రాష్ట్రం సీఎంతో కలిసి భోజనం చేస్తావ్‌..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చినావా కేసీఆర్‌..?‌మా దగ్గర చూసి వొచ్చి ఇక్కడ ఫోజులు కొడుతున్నాడు అన్నట్లుగా ఉంది కేజ్రీవాల్‌ ‌ప్రసంగం. ఖాలీలను భర్తీ చేస్తే కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లా..రాష్ట్రంలో ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు కానీ దేశం, ప్రపంచ బ్యాంకు గురించి మాట్లాడుతున్నావు..కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ప్రజలు 9 రకాల సరుకులు ఇచ్చాం. నువ్‌ ‌బియ్యం తప్ప ఇంకేమైనా ఇచ్చావా..ఇన్ని లక్షల కోట్లు రూపాయలు అప్పులు చేసి ఇవన్నీ పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయి…అధికారంలోకి వొచ్చే వాళ్ళని రానీయకుండా అడ్డుకోవడం ఒక పని, ఎవరిని అయితే విమర్శిస్తావో వాళ్లకే తెరవెనుక మద్దతు ఇవ్వడం ఇది కేసీఆర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పని..అని పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు .

Leave a Reply