Take a fresh look at your lifestyle.

హుజూరాబాద్‌ ‌వోటమిని మరిపించేందుకు… కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ కేసీఆర్‌ ‌కొత్త డ్రామా

  • దళిత సిఎం హావి•ని విస్మరించింది కేసిఆరే కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • ఎపిలో మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడంపై హర్షణీయం

తెలంగాణకు దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి సిఎం కెసిఆర్‌ను ప్రశ్నించారు. దళితులు ముఖ్యమంత్రిగా పనికిరారా అన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలకు సభలతో హడావుడి చేసి..ఫలితాల తర్వాత దాన్ని కనుమరుగు చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనడం లేదంటూ కేసీఆర్‌ ‌కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. ఈ యాసంగతిపాటు వొచ్చే యాసంగికీ కేంద్రమే బియ్యాన్ని కొంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని కొత్తగా కొంటుందా అని ఇప్పుడు కేసీఆర్‌ అం‌టున్నారని, కానీ ఈ ఏడేండ్లు బియ్యం తానే కొంటున్నానని సీఎం చెబుతూ వొచ్చారని, హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత కేంద్రం కొననంటోందని అంటున్నారని కిషన్‌ ‌రెడ్డి దుయ్యబట్టారు. ఈ సమస్యను ఐదారేళ్ల నుంచి రాష్ట్రం దృష్టికి కేంద్రం తీసుకొచ్చిందని, బాయిల్డ్ ‌రైస్‌ ‌తప్ప మిగతాది కొనమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఆయన స్పష్టం  చేశారు. బాయిల్డ్ ‌రైస్‌ ‌సప్లయ్‌ ‌చేయమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని, కానీ ఇప్పుడు లేని సమస్యను ముఖ్యమంత్రి తెరవి•దకు తెచ్చారని అన్నారు.

‘అసలు టీఆర్‌ఎస్‌ ‌బాధేంటి? కేంద్ర మంత్రిగా ‘రా రైస్‌’ ‌కొంటామని నేనే చెప్పాను. ఇప్పుడే కాదు వొచ్చే యాసంగికి కూడా కొంటాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రతి గింజను కొంటామని స్పష్టం చేస్తున్నా. ఈ ఏడు సంవత్సరాలుగా మేం బియ్యం కొంటున్నమని టీఆర్‌ఎస్‌ ‌నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది.. బియ్యం కొంటుంది కేంద్రమేనని. ప్రతి క్వింటాల్‌ ‌ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుందని రైతులు అర్థం చేసుకోవాలి’ అని కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. ‘ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తామంది. అందులో తప్పు లేదు. అయితే తెలంగాణలో గత ఏడున్నరేళ్లుగా ఎంతమంది అన్నదాతలు చనిపోయారు? వారి కుటుంబాలకు ఎందుకు ఆర్థిక సాయం అందించడం లేదో చెప్పాలి. అది వి• బాధ్యత కాదా? రాజకీయ జూదంలో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? వి• కారణంగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి’ అని కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఎపిలో మూడు రాజధానుల బిల్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై మాట్లాడుతూ.. ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటనపై స్పందించిన ఆయన వి•డియాతో మాట్లాడుతూ..ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుందన్నారు. రైతుల మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply