Take a fresh look at your lifestyle.

రామాలయంకు వందకోట్లు ఇవ్వడంలో కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం

  • స్వామివారి ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చే తీరిక కేసీఆర్‌కు లేదు
  • భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌విమర్శ

భద్రాచలం,మార్చి 08 (ప్రజాతంత్ర ప్రతినిధి): యావత్‌ ‌భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన దేవాలయం అయిన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయం అభివృద్దికి వందకోట్ల రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీర్‌ ఏళ్ళు గడుస్తునప్పటికి నేటికి ఒక్క రూపాయి కూడ దేవాలయం అభివృద్దికి ఖర్చు పెట్టలేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌తీవ్రంగా విమర్శించారు. సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళేముందు శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఏమాత్రం ఉపయోగకరంగా లేదని అన్నారు. ఎన్నోఏళ్ళుగా ఆనవాయితీగా ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరుపున ఉన్న ముఖ్యమంత్రి తీసుకురావాల్సి ఉండగా స్వామివారి ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చే తీరిక కూడ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని విమర్శించారు. భదాద్రి రామున్ని నిర్లక్ష్యం చేస్తే శిక్ష తప్పదని అన్నారు. ఆలయాల అభివృద్ది చేయటం వలనే ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అన్నారు. ఆలయాలలో వస్తున్న ఆదాయం ఎక్కడిపోతుందో ఇప్పటివరకు లెక్కలేదని అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో ఆలయాలు పనితీరు ఏమాత్రం సరిగ్గాలేదని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి అనుభవించటం మీద ఉన్న ప్రేమ శ్రీరాముని మీద లేదని అన్నారు. ఆయనకు రాముని మీద సెంటిమెంట్‌ ‌లేకపోయిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున పవిత్ర శ్రీస్వామివారి కల్యాణముకు ముత్యాల తలంబ్రాలు తీసుకురావాల్సిన భాధ్యత ఉందని అన్నారు. కేసీఆర్‌కు భద్రాచలంలో ఆస్తులు లేకపోవడం వలనే అభివృద్ది చేయటం లేదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తలంబ్రాలు తీసుకురాకపోగా తన మనవడితో తలంబ్రాలు తీసుకురావడం పట్ల ఆయన తీవ్రమైన విమర్శలు చేసారు. అంత ఖాళీ లేనప్పుడు తెలంగాణ ప్రజలకు తెలియపరచాల్సిన భాధ్యత ఆయనపై ఉందని అన్నారు.

వంద కోట్లు ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నందునే ముఖ్యమంత్రి భద్రాచలం వస్తే రామ భక్తులు నిలతీస్తారనే భయంతోనే కేసీఆర్‌ ‌భద్రాచలం రావడం లేదని ఎద్దేవా చేసారు. బిజెపి ప్రభుత్వం రామాయణ ప్యాకెజీ క్రింద 500 కోట్లు ప్రకటించటం జరిగిందని ముందుగా 30 కోట్లు విడుదల చేయటం జరిగిందని తెలిపారు. అయితే కేసీఆర్‌ ‌డిపిఆర్‌ ( ‌డిటల్‌ ‌ప్రాజెక్టు రిపోర్టు)ఇవ్వకపోవడం వలనే నిధులు ఆగినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన చేపట్టే ఏ పనికి డిపిఆర్‌ ఇవ్వరని విమర్శించారు. నిన్న జరిగిన బైంసా లో దాదాపు 8 మంది హింధూ యువకులు ప్రాతీకేయుల మీద కత్తిపోటుదాడులు జరిగాయని అన్నారు.

బైంసా తెలంగాణలో ఉందా లేక పాకిస్తాన్‌లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సిగ్గుపడాలని అన్నారు. యంఐయం పార్టీని పెంచిపోషిస్తున్నారని అన్నారు. కొన్ని జర్నలిస్టు సంఘాలు కేసీఆర్‌ ‌మోచేయి క్రింద పనిచేస్తున్నాయని విమర్శలు చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు ఉప్పల శారద, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జీ మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి , నాయకులు ఎర్రం రాజు భెహారా , నాగబాబు మరియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply