మందమర్రి, మే 6, ప్రజాతంత్ర విలేఖరి : కరోనా వైరస్ విపత్కర సమయంలో లాక్డౌన్ ఎత్తివేతపై మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశం లో మేధావులు, అదికారులను కూర్చొని చర్చించి ఏం సాధించారు అంటే మధ్యం షాపులు తెరవమని, మధ్యం రేట్లు 16శాతం పెంచమని చెప్పి చర్చించారు తప్పా పేద ప్రజలపై ప్రేమ చూపలేదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం స స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో గత నలభై రోజులుగా రోజువారి కూలీ పనిచేసుకునే దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, నిరుపేద ప్రజలు అప్పుల ఊబిలో పడి కొట్టుమిట్టా తున్న తరుణంలో డబ్బులు ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయాలు సరిపోక చాలిచాలని బతుకులు బ్రతుకున్నారని ప్రభుత్వం అందించే 1500 రూపాయా లు కూడా చాలా మందికి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పాలనలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులతో మధ్యం షాపుల వద్ద దగ్గర నుండి మధ్యం అమ్మకాలను జరిపించాలని చెప్పిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికె దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ విపత్కర పరిస్థితిలో మధ్యం షాపులు తేవడం వలన ఇంట్లో భార్య పిల్లలకు గొడవలు జరుగుతాయి. యాక్సిడెంట్లు అవుతాయి, ఇతరత్రా అసాంఘిక కార్యక్రమాలు జరగుతూనేఏ ఉంటాయి, వీటి వల్ల శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగదా అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఆనేది ఆలోచించాల్సింది పోయి కరోనా వైరస్ పెరిగే విధంగా చర్యలు చేపట్టడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌పై దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు హానీ జరుగకుండా చూడాలని, అలాగే నిరుపేదలైన దినసరికూలీలకు నెలకు మూడు వేల రూపాయాల చొప్పున చెల్లించాలని, అలాగే ప్రమాదాన్ని ఎదురించి ముందుకు వెళ్తున్న జర్నలిస్టులకు 20 వేల రూపాయాలు తక్షణమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి.షరీషా, వాసాల సాగర్, జక్కుల సమ్మయ్య, శ్రీనివాస్, సురేష్, బైరాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.