Take a fresh look at your lifestyle.

దేశ యువతకు ఉద్యోగ కల్పన కేసీఆర్ లక్ష్యం…!

ప్రపంచంలో ఏ దేశంలో లేని అపారమైన యువశక్తి  భారతదేశంలో ఉంది. నేటి దేశ 140 కోట్ల జనాభాలో మానసిక వైకల్యం లేకుండా, ఆరోగ్యంగా ఉంది, తన కాళ్లమీద తను నిలబడే సామర్థ్యం గల వారు 90కోట్లు ఉన్నారు.వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది.పాలకులు అనుసరించే విధానాల వల్ల ఉపాధి కల్పించే రంగాలు సంక్షోభంలో కూరుకపోతున్నాయి. మోదీ  ప్రభుత్వానికి ముందు చూపులేని కారణంగా దేశ అభివృద్ధి తిరోగమన దిశలో సాగుతున్నది. లక్షలాది ఉద్యోగాలకు నిలయంగా ఉన్న  ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడం లేదా వేలం వేయడం సాఫీగా సాగుతున్నది. నష్టాల పేరుతొ మూసివేయడం జరుగుతుంది. దేశంలో ఉన్న నిరుద్యోగం రూపుమాపుతామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఉత్తర ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ  ఉన్న పరిశ్రమలు మూసివేసి ,లక్షలాది ఉద్యోగాలకు ఎసరు తెచ్చింది.
నిరుద్యోగంతో ఆత్మహత్యలు దిన,దినం పెరుగుతూన్నాయి.దేశం అభివృద్ధి బాటలో సాగుతున్నదని జుమ్లా మాటలకు ఎగబడింది. గత ఐదు సంవత్సరాలుగా పెరుగుతున్న నిరుద్యోగం 2018-19లో వెలువడిన నివేదికలు వారి గోబెల్స్ ప్రచారం కి అద్ధం పడుతున్నాయి. మోదీ  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం దాదాపు 18.6 మిలియన్ల మంది భారతీయులు నిరుద్యోగులుగా ఉండి జీవచ్ఛంలా మారినారు. మరో 393.7 మిలియన్ల ప్రజలు చిన్న,చితక ఉద్యోగాల్లో స్థిరపడినారు.నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వ ఏజెన్సీ నిర్వహించిన మొదటి సర్వే నివేదిక ప్రకారం 2017లో సాదారణ నిరుద్యోగ స్థితి 6.1 శాతం ఉంది.ఈ కాలంలో గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో పురుష నిరుద్యోగ యువత శాతం 17.4% నుంచి 18.7% కి  పెరిగింది. 2019-20లో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన నివేదికలో 2021 జనవరి -మర్చి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 9.3% ఉంది.2019లో రెండవ సారి అధికారం చేపట్టిన మోదీ ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూనే..
ఈ సంవత్సరం నిరుద్యోగం గత ఆరునెలల్లో తగ్గుముఖం పట్టిందని మోదీ  ప్రభుత్వం వల్లే వేస్తుంది.పైగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడానికి గల కారణాలను మోదీ  ప్రభుత్వం అన్వేషించలేదు.ఎనిమిది సంవత్సరాలుగా నిరుద్యోగ సమస్యకు బిజెపి ప్రభుత్వం పరిష్కారం చూపకుండా ఖాలీగా  ఉన్న 60 లక్షల ఉద్యోగాలను నింపకుండా నష్టానికి ఒడిగట్టిందనే విమర్శ ఉంది.దేశాభివృద్ధిలో నిత్యం చర్చజరగాలి. దేశ భవిష్యత్‌పై చర్చ జరగాలి. అంతేకానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలతో రచ్చ చేస్తున్నది. యువతను అటువైపు ఉసిగొల్పి వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నది. దేశంలో నైపుణ్యం గల యువతకు కొదువలేదు. అందుకే విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలల్లో మనవాళ్లు భాగస్వామ్యులుగా, సిఈఓ లుగా ఉంటున్నారు.
అంతటి ప్రతిభ ఉన్న యువతను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం హేయనీయం.యువత తమ విజ్ఞానంతో విజయాలు సాధించాలని ఆకాంక్షించే వారిలో మన ముఖ్యమం త్రి కేసీఆర్ ముందుంటారు.ఇవేం పట్టని మతతత్వ ,విద్వేష మూకలు నిరుద్యోగం అంటూ యువతను రెచ్చగొడుతున్నాయి. తాము రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు యువతను పెడదారి పట్టించే ప్రయత్నం చేయడం అత్యంత బాధాకరం.రాష్ట్రంలో బీజేపీ అవలంబిస్తున్న విధానం ఇదే. కానీ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగుల సంఖ్య పెరిగిందనే విషయం రాష్ట్ర బీజేపీ నాయకులు మరిచిపోయి ‘నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భారతదేశాన్ని మతతత్వ అతివాద, మితవాద, బీజేపీ అస్తవ్యస్త ప్రమాదకర విద్వేషశక్తుల నుంచి  యువతను కాపాడడానికి కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్  సర్కార్’ అనే నినాదంతో  గుణాత్మక మార్పు కోసం, విధ్వంసం అయినా సమాఖ్య స్ఫూర్తిని  కాపాడడం కోసం డా.
బీఆర్ అంబేద్కర్ కలలు కన్న నవభారత నిర్మాణానికి, ‘బిజెపి ముక్త్ భారత్’ కోసం నడుం బిగించి  లౌకికవాద, ప్రజాస్వామ్య సంప్రదాయంతో వెలిగిపోయిన ఒకప్పటి అద్భుతమైన భారతీయ గతాన్ని పునరిద్ధరించేందుకు బీఆర్ఎస్ పార్టీ పురుడుపోసుకుంది. కేంద్రంలోని బీజేపీ కి ప్రభుత్వాలు కూలదోయడం మీద ఉన్నంత ప్రేమ యువత మీద ఉంటే నిరుద్యోగ సమస్య లేకుండా కార్యాచరణ జరిగేది. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు,నిధులు, నియామకాలు ఒక్కొక్కటిగా ఆవిష్కరించి,ఐటిఐఆర్ కుట్ర పూరితంగా రద్దు చేసిన దేశంలోనే నెంబర్ వన్ గా  తీర్చిదిద్ది  దేశ ప్రజల మన్ననలు పొందినారు. ఓ దిక్కు టీ -హబ్ ,మరోదిక్కు టీఎస్ఐపాస్  వంటి పథకాలు యువతకు ఉద్యోగ భరోసానందిస్తున్నాయి. తెలంగాణలో  మాదిరిగానే దేశమంతా ఉద్యోగాల జాతర సాగాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉద్వాసన పాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.కార్పొరేట్లను బతికించేందుకు పరిశ్రమలను అమ్మడానికి, మూసివేయడానికి దారులు వెతుక్కొని ,అసంబద్ధ మైన విధానాలతో యువత ఉసురు తీస్తుందని విమర్శ ఉంది.
కేసీఆర్ సారథ్యంలో మొలకెత్తే విత్తనం సర్దుకుపోవడానికి చిహ్నం కాదు. సంఘర్షణకు ప్రతిరూపం. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ వర్తమానం అలాంటి పురోగామి స్వభావాన్ని అందిపుచ్చుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో అవకాశం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉన్నది. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వచ్చాక, మెగా జాబ్ మేలా  కు శ్రీకారం చుట్టింది. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టింది. ఎన్నో ఆంక్షల నడుమ స్వరాష్ట్రంలో స్వపరిపాలనను మొదలుపెట్టి తొమ్మిది ఏండ్ల వ్యవధిలో సుమారు రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రను లిఖించింది.
ఇవి కాకుండా పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నది. ప్రైవేటురంగంలో పరిశ్రమల స్థాపన ద్వారా సుమారు 16 లక్షల 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా చేసింది. ఏళ్ళ తరబడి ప్రభుత్వ వ్యవస్థలో వివిధ హోదాల్లో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు కార్యచరణ  చేపట్టింది. ‘‘ఉద్యమకాలంలో, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ఇవాళ దేశంలో నవ శకానికి నాంది పలికింది. యువతకు ఉద్యోగాల కల్పన. ప్రభుత్వ ఉద్యోగం చదువుకున్న ప్రతీ విద్యార్థి కల. కానీ ఆ కల అందరికీ నెరవేరదు. అయినా ఏ ప్రభుత్వానికి సాధ్యం కానిది, కేసీఆర్ ప్రభుత్వం సుసాధ్యం చేసి, ఉద్యోగాల కోసం ఎదురుచూసి వయస్సు మళ్లుతున్న వారికీ సైతం గరిష్ట వయో పరిమితి 10 ఏండ్లకు పెంచి వారి దార్శినికతను చాటుకొని వారి ఆశలకు జీవం పోయడం ముదావహం.
image.png
డా.సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355

Leave a Reply