Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ అం‌డతో రెచ్చిపోతున్నారు

Between NPR and NRC There is no deference kishan reddy
ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
  • ఏఐఎమ్‌ఐఎమ్‌ ఎం‌పీ అసదుద్దీన్‌పై మండిపడ్డ
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి
  • లక్ష మంది  అడ్డుకున్నా సీఏఏను అమలు చేసి తీరుతామని వ్యాఖ్య

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో, బయట సీఏఏ వల్ల దేశంలో ఎవరికీ నష్టం లేదని చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహ రిస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు. సీఏఏలో మైనార్టీలకు నష్టం చేసే ఏ ఒక్క అంశం కూడా లేదని తాను హామీ ఇస్తున్నాననీ, అలాంటిది ఏదైనా ఉందని ఎవరైనా నిరూపిస్తారా ? అని సవాల్‌ ‌విసిరారు. లక్ష మంది అసదుద్దీన్‌ ఒవైసీలు అడ్డం వచ్చినా సీఏఏను దేశంలో అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అంటున్న రాజకీయ పార్టీలు దేశంలోని 130 కోట్ల ప్రజలకు అందులో వ్యతిరేకంగా ఉన్న అంశాలేమిటో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే ప్రయత్నం చేస్తున్నారనీ, దీనిని ఓర్వలేని ప్రతిపక్షాలు సీఏఏ పేరుతో ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని చెప్పినా దేశ భద్రత కోసం చేసే పనులలో మోడీ ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌, ఐంఎంఐ ‌పార్టీలు సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పో పోటీ సభలు పెడుతున్నాయనీ, చట్టంలో ఏముందో చెప్పేది, అమలు చేసేది కేంద్రంలలో ప్రభుత్వంలో ఉన్న తామేనని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సమయంలో సీఏఏ పేరుతో హింసపు ప్రేరేపించడం ద్వారా దేశానికి ఏం చెప్పదలచుకున్నారని ప్రశ్నించారు. ఒక చేతిలో జాతీయ జెండా పట్టుకుని మరో చేత్తో రాళ్లతో పోలీసులను కొట్టి చంపడం ఎలాంటి దేశభక్తి అనిపించుకుంటుందో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న హింస వెనక ఎవరి హస్తం ఉందనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దేశ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామనీ, షాహీన్‌బాగ్‌ ‌రోడ్డును రెండు నెలలుగా నిర్బంధించి ఆందోళన చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకుంటారని కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటిస్తున్నదని తెలిపారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్‌ ఒవైసీ నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతున్నదనీ, కేసీఆర్‌ అం‌డ చూసుకుని అసద్‌ ‌రెచ్చిపోతున్నాడని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీతో దోస్తాన్‌ ‌చేస్తూ సీఎం కేసీఆర్‌ ‌పులిపై స్వారీ చేస్తున్నాడనీ, అది భవిష్యత్తులో ఆయనకే ప్రమాదమని ఈ సందర్భంగా కిషన్‌ ‌రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply