Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుపై కెసిఆర్‌ ఎం‌దుకు స్పందించరు.?

  • కేసులు ఎందుకు వేశామో తెలియదా? : పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌
  • ఇరిగేషన్‌ ‌కార్యదర్శికి కాంగ్రెస్‌ ‌నేతల ఫిర్యాదు

పోతిరెడ్డిపాడుపై సిఎం కెసిర్‌ ఎం‌దుకు మౌనంగా ఉంటున్నారో, ఎందుకు ఎపికి సహకరిస్తున్నారో చెప్పాలని,  టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులపై కేసులు వేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, ఎందుకు వేశాడో అతన్నే అడగండి చెబుతాడని చెప్పారు. ప్రజల భూములు బలవంతంగా లాక్కుంటుంటే వారికి అండగా నిలబడ్డామని చెప్పారు. ప్రజల పక్షాన కోర్టుకు వెళ్తే తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజల ప్రయోజనాల్ని కాపాడకుండా తమపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు. సీఎంలు కేసీఆర్‌, ‌జగన్‌తో మాట్లాడి పోతిరెడ్డిపాడు పనులు ఆపిస్తే అభినందిస్తామని తెలిపారు. పనులు ప్రారంభమైతే కేసీఆర్‌ ‌బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. పోతిరెడ్డిపాడుపై ప్రధాని, కేంద్ర జలవనరుల మంత్రికి ఫిర్యాదు చేస్తామని ఉత్తమ్‌కు మార్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీశ్‌రావును కాంగ్రెస్‌ ‌నేత రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మే 5న జగన్‌ ‌ప్రభుత్వం జీవో తెస్తే ..మే 11న కేసీఆర్‌ ‌సక్ష చేశారని విమర్శించారు. కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌ ఈ ‌జీవోల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ 55వేల క్యూసెక్కులు తీసుకెళ్తుంటే కేసీఆర్‌ ఏం ‌చేస్తున్నారని ప్రశ్నించారు. పోతిరెడ్డి కాంట్రాక్టు పనులు కేసీఆర్‌ ‌చెప్పిన వారికే వస్తాయని, ఏపీ జలదోపిడీపై ప్రధాని, జలవనరుల మంత్రికి లేఖలు రాస్తామని రేవంత్‌ ‌ప్రకటించారు. ఇరిగేషన్‌ ‌ముఖ్య కార్యదర్శిని కాంగ్రెస్‌ ‌నేతలు కలిశారు. రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పరిగి రామ్మోహన్‌ ‌రెడ్డి, ప్రసాద్‌ ‌కుమార్‌లు కలిసిన వారిలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించాలని రేవంత్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకునేందుకు జగన్‌కు కేసీఆర్‌ ‌గిప్ట్‌గా ఇచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ అనుమతితోనే జగన్‌ ‌జీవో 203 తెచ్చారని, కాంగ్రెస్‌ ఆం‌దోళన తర్వాతే కేసీఆర్‌ ‌మేల్కొని సక్ష చేశారని రేవంత్‌రెడ్డి చెప్పారు.

 

తెలంగాణ ఉద్యమ సమయలో సీఎం కేసీఆర్‌ ‌రైతులను కొండెక్కించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చి ఆరేళ్ళు అవుతున్నా.. రైతుల మొహాలలో సంతోషం లేదని అన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు పేరుద ఓట్లు దండుకొని టీఆరెస్‌ ‌రాజకీయాలు చేస్తోందని అన్నారు. టీఆరెస్‌ ‌ప్రభుత్వంలో రైతులకు పంటనష్టం జరిగిందని, రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేదని అన్నారు. కేసీఆర్‌ ‌రైతా..? లేక రాజకీయ నాయకుడా? సమాధానం చెప్పాలన్నారు. ఎకరానికి ఐదు వేలు ఇస్తా అన్న కేసీఆర్‌.. ఇప్పటికి వరకు రైతులకు పూర్తిగా రైతుబంధు రావడం లేదన్నారు. గతేడాది రైతు బంధు 60శాతం రాలేదని, ఈ ఏడాది అసలు వస్తుందా? రాదా? అనేది కూడా ఎవ్వరికి తెలియదని జగ్గారెడ్డి అన్నారు.

తాజాగా ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనే కేసీఆర్‌ ‌నిబంధన పెడుతున్నడంటే.. రైతు బంధు వదిలించుకునే ప్రయత్నమే జరుగుతున్నట్టు అనిపిస్తోందన్నారు. రైతు బంధులానే రేపు తాను చెప్పిన పిల్లనో ,పిలగాన్నో చేసుకోకపోతే కళ్యాణ లక్ష్మీ కూడా ఇవ్వనంటాడోమో నని జగ్గారెడ్డి అన్నారు. . తెలంగాణ వస్తే పెరుగన్నం తినొచ్చన్నారు..హాయిగా ఉండొచ్చొన్నారని, పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా రావడం లేదని ద్వజమెత్తారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు రైతు బంధు గుర్తొస్తుందన్నారు. తను చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే.. కల్యాణ లక్ష్మి ఇస్తానని కేసీఆర్‌ అం‌టారేమోనని ఎద్దేవాచేశారు. మంత్రి హరీష్‌రావు ఉమ్మడి జిల్లా మెదక్‌కు చేసిందే లేదన్నారు. సంగారెడ్డిలో హరీష్‌రావు టింగ్‌ ‌పెడితే హాజరై రైతుబంధుపై నిలదీస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Leave a Reply