Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

  • ఉద్యోగాల భర్తీ ప్రకటన హర్షణీయం
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 9 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఉద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని..80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్‌ ‌చేసిన ప్రకటనపై జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ‌కోరుతానని చెప్పారు. హౌసింగ్‌ ‌విభాగాన్ని మళ్లీ తెరవాలని సీఎంను కోరుతానని వెల్లడించారు. బిస్వాల్‌ ‌కమిటీ నివేదిక ప్రకారం మిగతా పోస్టులు భర్తీ చేయాలన్నారు.

ఈ విషయంలో తమ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవన్నారు. ఏడేండ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని పలుమార్లు విమర్శించాం. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది లేకుండా పని చేయదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. గత 7 సంవంత్సరాలుగా నోటిఫికేషన్‌లు ఇవ్వట్లేదని అనేక సార్లు మేము విమర్శించామన్నారు. యూత్‌ ‌కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ అనేక పోరాటాలు చేసాయన్నారు. ఈరోజు ఈ ఫలాలు వొస్తున్నాయంటే.. సోనియా, రాహుల్‌ ‌గాంధీ పాత్ర కీలకమన్నారు.

Leave a Reply