Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ను ఫామ్‌హౌజ్‌లో కలవలేదు

  • అదెక్కడుందో కూడా తెలియదు
  • టిఆర్‌ఎస్‌లో చేరుతాననడం అంతా ఉత్తిదే
  • పార్టీ ఆదేశిస్తే హుజారాబాద్‌లో పోటీచేస్తా
  • వి•డియా సమావేశంలో మాటమార్చిన బిజెపి నేత పెద్దిరెడ్డి

కెసిఆర్‌ను తాను ఫామ్‌హౌజ్‌లో కలవలేదని, అదెక్కడుందో కూడా తనకు తెలియదని మాజీమంత్రి, బిజెపి నేత పెద్దిరెడ్డి అన్నారు. తాను టిఆర్‌ఎస్‌లో చేరుతాన్న ప్రచారం అవాస్తవమని కూడా అన్నారు. మాజీమంత్రి ఈటల రాజేందరే కాదు బీజేపీలోకి సీఎం కేసీఆర్‌ ‌వొచ్చినా స్వాగతిస్తామని పెద్దిరెడ్డి ప్రకటించారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ అభ్యర్థి గురించి ఆలోచిస్తామని, అవకాశం వొస్తే హుజూరాబాద్‌లో పోటీ చేస్తానని వెల్లడించారు. బీజేపీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, వారందరూ అర్హులేనని పెద్దిరెడ్డి చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే హుజురాబాద్‌ ఉపఎన్నికలో పోటీచేస్తానన్నారు పెద్దిరెడ్డి. హుజురాబాద్‌కు ఎన్నికలు ఇప్పుడే రావని..మరో ఆరు నెలల సమయం పట్టొచ్చన్నారు.

ఈటల రాజేందర్‌ ‌బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. హుజురాబాద్‌ ‌బీజేపీ టికెట్‌ ‌కేటాయింపు విషయంలో అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానన్నారు. హుజురాబాద్‌లో అభివృద్ధి జరగలేదన్నారు. 2018లో పోటీ చేద్దామనుకుంటే అలయెన్స్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీకి టికెట్‌ ‌కేటాయించారన్నారు. తాను కేసీఆర్‌ను ఫామ్‌ ‌హౌస్‌ ‌లో కలిసినట్లు.. టిఆర్‌ఎస్‌ ‌లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.

బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి టికెట్‌ అడిగే హక్కు ఉంటుందన్నారు.. కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనలని అన్నారు. గతంలో ఈటల బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈటల బీజేపీలోకి వొస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు కూడా. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. అయితే ఇప్పుడేమైందో ఏమోగాని పెద్దిరెడ్డి మాట మార్చారు.

Leave a Reply