Take a fresh look at your lifestyle.

స‌మ‌స్య‌లు లేవ‌నెత్త‌కుండా కేసీఆర్ కుట్ర‌లు -సిఎల్పీ నేత  భట్టి విక్రమార్క    

*నా రాజకీయ జీవితం లో మీడియా పై ఆంక్షలు చూడలేదు ..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 
* అసెంబ్లీ ని కూడా ఫామ్ హౌస్ లో పెట్టుకోండి ..రాజగోపాల్ రెడ్డి 
* టీఆరెస్ మిత్రపక్షమైన  ఎంఐఎం ఎందుకు హాజరుకాలేదు…సీతక్క
* కేసీఆర్ నిన్ను సెంట్రల్ మినిస్టర్ చేసింది కాంగ్రెసే ..జగ్గారెడ్డి 
 ప్ర‌జాస్వామ్యంలో దేవాల‌యం వంటి శాస‌న‌స‌భ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కుతోంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు ప్ర‌తిప‌క్షం ఉనికే స‌భ‌లో లేకుండా చేసేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండి ప‌డ్డారు.మంగళవారం  శాస‌న‌స‌భ ముగిసిన త‌రువాత సీఎల్పీ నేత ఆధ్వర్యం లో ఎమ్మెల్యేల‌తో  గ‌న్ పార్క్ వ‌ద్ద ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో సీఎల్పీ నేత‌తో పాటు ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, సీత‌క్క‌, తూర్పు జ‌గ్గారెడ్డి ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన అంశాల‌ను, ప‌లు స‌మ‌స్య‌ల‌ను, స‌భ‌లో చ‌ర్చించేలాని అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌భ దృష్టికి తీసుకురావ‌డంలో ప్ర‌తిప‌క్షం పాత్ర కీల‌క‌మైంద‌ని అన్నారు. అటువంటి ప్ర‌తిప‌క్షం గొంతు నొక్కి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఫైర్ అయ్యారు . . ఇటువంటి చ‌ర్య‌లు ప్ర‌జాస్వామ్యానికే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు. సభ‌లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న‌ది కేవ‌లం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మేన‌ని అన్నారు. ఎంఐఎం స‌భ్యులు ప్ర‌భుత్వానికి స‌భ‌లో మిత్ర‌ప‌క్షంగానే ఉన్నార‌ని అన్నారు. కాంగ్రెస్ సంఖ్యాబ‌లాన్ని బ‌ట్టి మాట్లాడేందుకు స‌మ‌యం ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్న అంశంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు 19 మంది ఎమ్మెల్యేల‌ను ఇచ్చి ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌మ‌ని ప్ర‌జ‌లు చెప్పార‌ని భట్టి అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను కేసీఆర్ కొని.. సంఖ్యాబ‌లం లేద‌ని చెప్ప‌డం విడ్డూర‌మ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీకి రోజులో 6 నిమిషాలు కేటాయించి మాట్లాడ‌మంటే.. ఏమి మాట్లాడాల‌ని ఆమ‌న ప్ర‌శ్నించారు. ఆ 6 నిమిషాల్లోనే 2వ నిమిషంనుంచే గంట కొడుతుంటే.. ఏమి చేయాల‌ని అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌భ‌లో ఏవిధంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతామ‌ని అన్నారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో మీడియా పాయింట్ ఎత్తేయ‌డంపైనా భ‌ట్టి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి స‌భ‌లో మాట్లాడేందుకు కేవలం 6 నిమిషాలు ఇవ్వ‌డంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  మండిప‌డ్డారు..ఇక టీఆరెస్ మిత్రపక్షమైన ఎంఐఎం సభకు ఎందుకు రాలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే సీతక్క నిలదీశారు.ఇక కేసీఆర్ ను కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్ ని చేసిందని ,తెలంగాణ ఇచ్చి కేసీఆర్ ని సీఎం చేసిందని కాంగ్రెస్ కేసీఆర్ కి ఇంకేం చేయాలనీ  ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ప్రశ్నించారు.

Leave a Reply