Take a fresh look at your lifestyle.

నేడు మానుకోట పర్యటనకు కెసిఆర్‌

  • సవికృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : మహబూబాబాద్‌ ‌జిల్లాలో సీఎం కేసీఆర్‌ ‌గురువారం పర్యటించనున్నారు. సవి•కృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఉదయం 9.45నిమిషాలకు మహబూబాబాద్‌ ‌కు కేసీఆర్‌ ‌చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన సవికృత కలెక్టరేట్‌ ‌భవన సముదాయన్ని కేసీఆర్‌ ‌ప్రారంభించనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు.

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, ‌సత్యవతి రాథోడ్‌ అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 11.30 నుండి 12.30 వరకు 10 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ ‌సవి•క్షా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్‌ ‌కార్యాలయంలో అధికారులతో సవి•క్ష నిర్వహించనున్నారు. అనంతరం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ ‌భదాద్రి కొత్తగూడెం జిల్లాకు పయనం కానున్నారు.

Leave a Reply