Take a fresh look at your lifestyle.

కేసిఆర్‌ ‌పథకాలు, పాలన అంతా ఫేక్‌: బండి సంజయ్‌ ‌ఫైర్‌

  • ‌హుజారాబాద్‌లో కెసిఆర్‌ ‌డ్రామాలు మొదలు
  • ఫేక్‌ ఐడి కార్డులతో గందరగోళం సృష్టించే యత్నాలు
  • సిఎం తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఫైర్‌

ఇచ్చిన హావి•లు అమలు చేయకపోగా హుజారాబాద్‌లో ఓటమి తప్పదని గుర్తించిన టిఆర్‌ఎస్‌ ‌నకిలీ ఫేక్‌ ఐడి కార్డులతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. ఈటల రాజేందర్‌ ‌బావమరిది మధుసూధన్‌ ‌పేరుతో ఈ వ్యవహారం నడిపించి అభాసు పాలయ్యారని అన్నారు. సీఎం కేసీఆర్‌ అనేక హావి•లు ఇచ్చి విస్మరించారన్నారు. దళిత ముఖ్యమంత్రి, 112 అడుగుల అంబేడ్కర్‌ ‌విగ్రహం, ఉద్యోగాల భర్తీ వంటి అనేక హావి•లు విస్మరించారని అన్నారు. దీంతో కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌ ‌పథకాలు, పాలన మొత్తం ఫేక్‌ అన్నారు. కేసీఆర్‌ ‌తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. గురువారం ఢిల్లీలో పార్టీ ఎంపిలు ధర్మపురి అర్వింద్‌, ‌సోయం బాపూరావు, మాజీ ఎంపి చాడ సురేశ్‌ ‌రెడ్డిలతో కలిసి ఆయన వి•డియాతో మాట్లాడుతూ..హుజురాబాద్‌లో బీజేపీదే గెలుపు అని సర్వేలు చెబుతున్నాయన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం సర్వేలు కూడా బీజేపీనే గెలుస్తుందంటున్నాయన్నారు.

కేసీఆర్‌ ‌బంపర్‌ ఆఫర్లను ప్రజలు గుర్తించరని బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లో ఇచ్చిన హావి•లను గంగలో కలిపారని, నీట మునిగిన బాధితులకు ఇస్తామన్న పదివేల హావి•ని విస్మరించారని అన్నారు. హిందువుల ఇండ్లను టార్గెట్‌ ‌చేస్తూ జీహెచ్‌ఎం‌సీ అధికారులు కూల్చివేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. ఎంఐఎం నాయకుల జోన్లకు మినహాయింపునిచ్చి.. మిగిలిన ప్రాంతాలలో కూల్చడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎం‌సీ అధికారుల తీరును తప్పుబట్టారు. ‘జీహెచ్‌ఎం‌సీ అధికారులు, మేయర్‌ ‌కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్‌ ‌చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం దుర్మార్గం’ అని సంజయ్‌ అన్నారు. ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్‌ ‌జోన్‌, ‌ఖైరతాబాద్‌ ‌జోన్లకు మినహాయింపు ఇవ్వడం అన్యాయయమని, ఎందుకంటే ఇవి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలు అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలని తెలిపారు. వీటిని మినహాయింపు ఇచ్చి అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు కొనసాగిస్తున్నారని, ఇది ఒక రకంగా మెజారిటీ ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్చివేతలు నిలిపివేయాలని, ఖైరతాబాద్‌ ‌జోన్‌, ‌చార్మినార్‌ ‌జోన్‌లో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన తర్వాతనే మిగతా జోన్‌లలో చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తున్నామని బండి సంజయ్‌ అన్నారు. ప్రభుత్వం అక్రమార్కులకు అండగా ఉంటుందని, హుజూరాబాద్‌ ‌కోసం వరాలు ప్రకటిస్తుందని ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

Leave a Reply