Take a fresh look at your lifestyle.

రైతు బాంధవుడు కెసిఆర్‌ (‌నియంత్రిత పంటల విధానం)

“రైతులు సన్న రకాలు చాలా తక్కువగా వేస్తున్నారు . 15%సన్నరకాలు పండిస్తే 85%దొడ్డు రకాలు పండుతున్నాయి. దీనితో సన్నబియ్యం ధరలు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి డిమాండ్‌ ఎక్కువ ఉన్న పంటలు వేస్తేనే రైతుకు గిట్టుబాటు ధర అనుకున్న ధర కంటే ఎక్కువ వస్తుంది. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు సాగుచేసి రైతులు గిట్టుబాటు ధర పొందాలనేది ప్రభుత్వ ఆలోచన. గిరాకీ,సరఫరాలతో సంబంధం లేకుండా ఒకే పంట ఎక్కువ విస్తీర్ణములో సాగు చేయడం మరో పంటను పట్టించుకోకపోవడం వలన రైతులు నష్ట పోయే అవకాశం ఎక్కువ  కలదు.  పదే పదే ఒకే పంట వేస్తే ఆ భూమి నిస్సారంగా మారుతుంది. అన్నిరకాల పంటలు వేస్తేనే భూమి సారవంతంగా ఉండి పంట దిగుబడి కూడ ఎక్కువ వస్తుంది. అందుకనే ప్రభుత్వం ఈ వాన కాలం సీజన్లో వరి సాగును తగ్గించి ముఖ్యంగా దొడ్డు బియ్యం సాగును తగ్గించి డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సన్న బియ్యం ,పత్తి మరియు నిత్యం మనకు అవసరమగు డిమాండ్‌ ఉన్న ఆహారపు పంటలను రైతులు పండించేలా చర్యలు తీసుకోబోతున్నది.”

kcr Regulated Crop Policyతెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు గారి దార్శనికతతో తెలంగాణాలో వ్యవసాయం దేశానికే ‘’దిక్సుచి’’ గా మారుతున్నది. కెసిఆర్‌ ‌గారి పాలనలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా రూపుదిద్దుకొనుచున్నాడు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌,‌ప్రపంచములోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌తో బీడు భూములకు జలసిరులు, రైతుబంధు, రుణమాఫీ, పంటకోనుగోళ్లు లాంటి చర్యలతో తెలంగాణా రాష్ట్రం వ్యవసాయంలో దేశానికే ఆదర్శప్రాయంగా రూపుదిద్దుకొన్నది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణా రాష్ట్రం వ్యవసాయంలో కెసిఆర్‌ ‌పాలనకు ముందు,కెసిఆర్‌ ‌పాలనలో అని చెప్పుకునే పరిస్థితి ఉంది. తెలంగాణలో వ్యవసాయాభివృద్ది కొరకు ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకొంటున్నది. భారీ నీటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, త్రాగునీరు సమస్యలు పరిష్కారమైనవి. ముఖ్యంగా కెసిఆర్‌ ‌పాలనలో తెలంగాణా రాష్ట్రం ‘’భారతదేశపు ధాన్యాగారం’’ గా రూపుదిద్దుకొన్నది. తెలంగాణలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులతో ముఖ్యంగా వరి విస్తీర్ణం పెరిగి రికార్డు స్థాయిలో పంట చేతికొచ్చింది.ఎఫ్‌.‌సి ఐ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 45లక్షలమెట్రిక్‌ ‌టన్నుల బియ్యం సేకరిస్తే,అందులో దాదాపు 30లక్షల మెట్రిక్‌ ‌టన్నులు ఒక్క తెలంగాణా రాష్ట్రం నుంచే సేకరించింది. అంటే తెలంగాణా రాష్ట్రం వ్యవసాయంలో ఏవిధంగా దూసుకుపోతుందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఏడాది కోటి ముప్ఫయి ఐదు లక్షల ఎకరాల్లో పంటసాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. రైతు జీవితంలో పచ్చదనమే లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఈ సారి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దనుండి వారి గ్రామాల్లోనే మొత్తం పంటను కొంటున్నది. దేశం మొత్తం కరోనా ఉన్న ప్రస్తుత తరుణంలో తెలంగాణా రాష్ట్రం మాదిరిగా మరే రాష్ట్రంలోనూ రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయలేదు. ఈ సంవత్సరం తెలంగాణాలో బంగారు పంటలు పండాయి. దిగుబడులు ఉహించని స్థాయిలో భారీగా వచ్చాయి. ధాన్యం కొనుగోలు ద్వారా 20వేల కోట్ల నుండి 25వేల కోట్ల వరకు ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నది. ఈ నిధులను వారు తమ అవసరాలకు ఉపయోగించుకోవడం జరుగుతున్నది. వానా కాలం పంటకు కావలసిన ఎరువులు,పురుగు మందులు,ఇంటి అవసరాలకు వాడుకోవడం జరుగుతున్నది. రైతుల వద్ద డబ్బు ఉండడం వల్ల నిధులురొటేషన్‌ అయ్యి ఆర్ధిక రంగం పుంజుకునే అవకాశం కలదు. తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలతో ఇంతటి సంక్షోభ సమయంలోను మనం సంక్షేమాన్ని చూడగలుగుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయం పై చిత్త శుద్దితో పనిచేయలేదు. రైతుల సంక్షేమం కొరకు ఇంతలా ఆలోచించలేదు.

ఈ ఏడాది కోటి35 లక్షల ఎకరాల్లో ఏరువాక సాగుతున్న వేళ రైతుకు, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా కెసిఆర్‌ ‌వ్యవసాయ ప్రణాళికపై దృష్టి పెట్టడంవారికి రైతుల సంక్షేమం పై గల చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. పుట్లకొద్దీ వడ్లతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఇంకా మేలు చేసే ఆలోచనతో ఒక క్రమపద్ధతి ప్రకారం పంటలు పండించాలని సూచిస్తున్నది. డిమాండ్‌ ‌మరియు సరఫరాను దృష్టియందుంచుకొని పంటలు పండిస్తే లాభాలు అధికంగా వచ్చి రైతు ఆర్ధికంగా బలపడతాడని భావిస్తున్నది. అందరు మూసపద్ధతిలో ఒకే రకమైన పంటను వేయడంతో ఉత్పత్తి పెరిగి డిమాండ్‌ ‌తగ్గి రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. వాస్తవానికి తెలంగాణా రాష్ట్రంలో భారీ ప్రాజుక్టులు కట్టడం వాళ్ళ నీటి లభ్యత అధికమయ్యి మునుపటికన్నా ఎక్కువగా పంటలు పండాయి. ముఖ్యంగా వరిసాగు విస్తీర్ణం పెరిగి అవసరాని కన్నా ఎక్కువ ఉత్పత్తి అయినది. ఇది ఇంకా పెరిగితే రైతు ఆర్ధికంగా నష్టపోయే అవకాశం కలదు. వీటన్నింటిని దృష్టి యందుంచుకొని రైతుకు ఆర్ధికంగా లాభం చేయుటకొరకు ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానాన్ని తీసుకురావడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నది.రూపాయి పెట్టుబడికి రూపాయిన్నర లాభం వచ్చేలా పంటలు వేయాలని ముఖ్యమంత్రి గారు సూచిస్తున్నారు. ఆ పంటలు ఏమిటో ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వం మాట వింటే వ్యవసాయంలో రైతులు ఆర్ధికంగా బలపడడం జరుగుతుంది. తెలంగాణ భూములు నిజానికి వైవిధ్య సేద్యానికి అనుకూలమైన నేలలు. వీటిల్లో రైతులు అధికారులు సూచించిన పంటలు వేయాలి. ప్రభుత్వం చెప్పిన పంటలు వేయాలంటే దాని అర్ధం రైతుల బాధ్యత ప్రభుత్వం పూర్తిగా తీస్కుంటుందని చెప్పవచ్చు.

సమగ్ర వ్యవసాయ విధానం అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి వ్యవసాయ ప్రణాళికలు తయారు చేయిస్తున్నది.దీని ప్రకారం ప్రతి గ్రామంలో వర్షపాతం, సాగుభూమి, పంటల వారీగా వివరాలు,అవసరమైన ఎరువులు, గోదాముల లభ్యత, రైతు బంధు, భీమా తదితర రాష్ట్ర ,• •ంద్ర ప్రభుత్వ పథకాలు,వివిధ పథకాల కింద అందుతున్న సాయం, పంటల మార్పిడి అవకాశం,రైతు బంధు సమితి, ఆదర్శ రైతుల వివరాలు ఇందులో నమోదు చేయబడతాయి.వీటన్నింటిని దృష్టి యందుంచుకొని ఆ గ్రామంలో ఏవిధమైన పంటలు వేయాలనే నిర్ణయాలు అక్కడి వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తీసుకుంటారు. పంటసాగు ఎవరిష్టం వచ్చినట్లు వారు చేసుకోకుండా వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు,నిపుణులు చెప్పినట్లు పంటలు వేసే విధానం రావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. రాష్ట్రంలో పంటలసాగు విధానం ప్రత్నామ్యాయ పంటల గుర్తింపు,రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం,పంటకు మంచి ధర వచ్చేలా చూడడం లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్జి సారిస్తున్నది. ఇందు కొరకువ్యవసాయాధికారులు,రైతు సమన్వయ సమితులు,వ్యవసాయ యూనివర్సిటీలు,పౌరసరఫరా శాఖల మధ్య సమన్వయము తో రైతులకు మేలు చేసే వ్యవసాయ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో యున్నది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని సమగ్ర వ్యవసాయ విధాన రూపకల్పనలో భాగంగా రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్‌ ‌లు,జిల్లా,మండలస్థాయి వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితిలతో ,నిపుణులతో, శాస్త్రవేత్తలతో, క్షేత్రస్థాయి అధికారులతో,రైతులతో చర్చిస్తున్నది. వీరందరితో చర్చించిన అనంతరం సమగ్రమైన వ్యవసాయ విధాన రూపకల్పన జరిగే అవకాశం కలదు. మార్కెట్‌ ‌పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి మార్గదర్శకత్వం చేయడానికి ఒక నిపుణుల కమిటీని కూడా వేసే అవకాశం కలదు. రాష్ట్రంలో సాగైన పంటలకు మంచి ధర వచ్చి రైతులకు మేలు జరగాలని,ఒకే పంటవేసి నష్టపోకుండా ప్రత్యామ్యాయ పంటలు వేసే పద్దతిని అమలు చెయ్యాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ముఖ్యంగా ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా,మార్కెట్లలో డిమాండ్‌ ఉన్న పంటలను మాత్రమే రైతు పండించాలి. అలా చేస్తేనే రైతుకు మంచి ధర వస్తుంది. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

ముఖ్యంగా ప్రజల ఆహార అవసరాలు తీర్చేలా ప్రస్తుతం పంటలు పండడంలేదు. చాలా వరకు మనం విదేశాల నుండి పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన దగ్గర పండే వరిపంటలో రైతులు ఎక్కువగా దొడ్డు బియ్యం పండిస్తున్నారు. నిజానికి మన దగ్గర అత్యధిక శాతం ప్రజలు సన్నబియ్యం తినడానికే ఆసక్తి చూపుతున్నారు. సన్నబియ్యానికే అధిక డిమాండ్‌ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణా సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్‌ ఉన్నది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇవి ఎక్కువగా తింటున్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక స్థాయిలో 1.04టన్నుల వరిధాన్యం ప్రస్తుతం మార్కెట్లోకి వెల్లువెత్తుతున్నవి. ఇలా రికార్డు స్థాయిలో దిగుబడి వస్తున్నా చిల్లర మార్కెట్లో ధర తగ్గడం లేదు. దానికి కారణం ప్రజలు ఎక్కువగా తింటున్న సన్న బియ్యం రకంను తక్కువగా పండించడమే. రైతులు సన్న రకాలు చాలా తక్కువగా వేస్తున్నారు . 15%సన్నరకాలు పండిస్తే 85%దొడ్డు రకాలు పండుతున్నాయి. దీనితో సన్నబియ్యం ధరలు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి డిమాండ్‌ ఎక్కువ ఉన్న పంటలు వేస్తేనే రైతుకు గిట్టుబాటు ధర అనుకున్న ధర కంటే ఎక్కువ వస్తుంది. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు సాగుచేసి రైతులు గిట్టుబాటు ధర పొందాలనేది ప్రభుత్వ ఆలోచన. గిరాకీ,సరఫరాలతో సంబంధం లేకుండా ఒకే పంట ఎక్కువ విస్తీర్ణములో సాగు చేయడం మరో పంటను పట్టించుకోకపోవడం వలన రైతులు నష్ట పోయే అవకాశం ఎక్కువ కలదు. పదే పదే ఒకే పంట వేస్తే ఆ భూమి నిస్సారంగా మారుతుంది. అన్నిరకాల పంటలు వేస్తేనే భూమి సారవంతంగా ఉండి పంట దిగుబడి కూడ ఎక్కువ వస్తుంది. అందుకనే ప్రభుత్వం ఈ వాన కాలం సీజన్లో వరి సాగును తగ్గించి ముఖ్యంగా దొడ్డు బియ్యం సాగును తగ్గించి డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సన్న బియ్యం ,పత్తి మరియు నిత్యం మనకు అవసరమగు డిమాండ్‌ ఉన్న ఆహారపు పంటలను రైతులు పండించేలా చర్యలు తీసుకోబోతున్నది.అందులో మన రాష్ట్రం ఎక్కువగా కొరత ఎదురుకుంటున్న కందులను కూడా ఎక్కువ మొత్తములో సాగు చేయించాలని నిర్ణయం తీసుకుంది. దీని తో పాటుగా మనం నిత్యం ఉపయోగించే నూనె పంటలు ,పప్పులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, అల్లం, వెల్లులి,మక్కలు మరియు ఆకుకూరలు,కూరగాయలకు కూడా ఎక్కువ డిమాండ్‌ ఉన్నదీ.వీటిలో చాలా వరకు మనం దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది.డిమాండ్‌ ‌కు అనుగుణంగా వీటిని కూడా మన అవసరాలకు అనుగుణంగా పండించుకోవాలిసిన అవసరం కలదు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలలో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది దీనితో తక్కువ ధరకే వినియోగదారులకు కూరగాయలు లభించే అవకాశంకలదు. కొరత ఉన్న పంటలు పండించేలా రైతులను చైతన్య పరచాల్సిన అవసరం కలదు వీలైతే తగిన రాయితీలు,ప్రోత్సాహకాలు అందించాలి.

నియంత్రిత పద్దతిలో సాగు మొదలవడానికి ముందుగా వ్యవసాయ శాఖను పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నది .ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే లభ్యమయ్యేటట్లు రాష్ట్ర విత్తన మండలి చర్యలు తీసుకునేలా విత్తన మండలి ని ఏర్పాటు చేస్తున్నారు.నకిలి మరియు కల్తి విత్తనాలు అమ్మేవారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుంది వ్యవసాయ వర్సిటీలలో తెలంగాణలో పండించాల్సిన పంటలపై పరిశోధనలు ఎక్కువ జరగాలని ఆదేశాలిస్తున్నది. నియంత్రిత పంటల సాగు విధానంలో రైతులకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన సూచనలు చేస్తూ వారికి ఏళ్ళ వేళలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది.ఈ ప్రయోగం విజయవంతం అయితే తెలంగాణ రాష్ట్రం యావద్భారత దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రం అవుతుంది అనుటలో ఎలాంటి సందేహం లేదు . మన రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు మరియు వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరి రైతు ఆర్ధికంగా బలపడతాడని చెప్పవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాలను,ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌రంగాలను కూడా ప్రోత్సహిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వ్యవసాయాధారిత పరిశ్రమలకు చేయూతనివ్వాలి. వ్యవసాయరంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు సహకరిస్తే తెలంగాణాలో వ్యవసాయం ప్రజల ఆహార అవసరాలను తీర్చే స్థాయి నుండి లాభసాటి వ్యాపార హోదాను సంతరించుకుంటుందని అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ముఖ్యమంత్రిగారు తీసుకున్న ఈ మహత్తర కార్య క్రమానికి మనమందరం కూడా సహకరించి రైతుకు చేదోడు వాదోడుగా ఉండి రైతును చైతన్యం చేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. తెలంగాణా రైతును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దెందుకు సీఎం కెసిఆర్‌ ‌గారు కృషి చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈప్రయోగం విజయవంతమైతే తెలంగాణ రైతు యావత్భారత దేశానికే ఆదర్శ రైతు అవుతాడు.

ధాన్యం పండించే రైతు తాను తినడానికి బువ్వలేని స్థితి నుండి దేశానికే బువ్వపెట్టే సుభిక్ష స్థితికిఎదగడానికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌దార్శనికత మరియు తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన చర్యలు కారణమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘’ రైతు దేశానికి వెన్నెముక ‘’. రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబటి్ట ముఖ్య మంత్రి గారు చేపట్టిన నియంత్రిత వ్యవసాయ విధానం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం. ‘’జై కిసాన్‌ ‘’.

Leave a Reply