Take a fresh look at your lifestyle.

ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని   కేసీఆర్ రాజకీయం…!

*తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు
*ప్రజల అవేదన అర్దం చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ
*మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర
*పుస్తకావిష్కరణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమం చేసినా అని కేసీఆర్ ప్రజలను మోసం చేసిండని టీపిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నిజం లాంటి అబద్ధం అని, ఆయన ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేసిండని అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజేఏసీ చైర్మన్ ప్రోఫెసర్ పురుషోత్తమ్ రాసిన దాలి, చేదు నిజం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరై, టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీతో కలసి ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలు చేసిన వారు అయితే ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటారన్నారు. మనం తెలంగాణ సాయుధ పోరాటం చూశామని, ఆ పోరాటంలో పాల్గొన వారు భూములు ఆస్తులు త్యాగం చేశారని కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. అప్పటి ఉద్యమకారులు ఒక్కరూ కూడా ఆస్తులు, పదవులు సంపాదించుకోలేదన్నారు. కేసీఆర్ వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వారి కుటుంబంలో అందరికి ఎలా పదవులు వచ్చాయన్నారు. తెలంగాణలో ప్రజలను మోసం చేసి ఉద్యమం పేరుతో రాజకీయాలు చేసి ఆస్తులు, పదవులు సంపాదించింది కేసీఆరేనన్నారు. తెలంగాణలో నిజాం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. విద్య, వైద్యం, సకల సౌకర్యాలు కల్పించారు కానీ తెలంగాణా ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారన్నారు. ఆంధ్ర పాలకులు కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు చేపట్టారు కానీ తెలంగాణా ప్రజలు అణచివేతకు ఎదురు తిరిగారన్నారు. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తున్న, కల్యాణ లక్ష్మీ ఇస్తున్న, పెన్షన్లు ఇస్తున్న అంటే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. వీటికోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. తెలంగాణలో అణచివేత పెరిగి పోయిందన్నారు. తెలంగాణకు దళితున్ని  సీఎం చేస్తా అని ఈ దరిద్రుడు సీఎం అయ్యాడని మండిపడ్డారు. అర శాతం ఉన్నోళ్లు
అంతా క్యాబినెట్ లో ఉన్నారన్నారు. 16 శాతం ఉన్న దళితులు క్యాబినెట్ లో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మందకృష్ణ 24 ఏండ్లుగా ఉద్యమం చేస్తున్నాడని, 12 ఏండ్లు చేసి నువ్వేదో గొప్ప చెప్పుకుంటున్నావని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ కుటుంబాల సంగతి ఏంటని సూటిగా ప్రశ్నించారు. ఇటీవల మహిళను సీఐ అత్యాచారం చేసిన కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందన్నారు. ఆ అమ్మాయి మీద వ్యభిచారం కేసు పెట్టే ఆలోచన చేస్తుందన్నారు. భర్త మీద బ్లాక్ మెయిల్ కేసు పెట్టాలని చూస్తున్నారన్నారు. కెసిఆర్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు, రాదిసన్ పబ్ వివరాలు అన్ని ఈ సిఐ దగ్గరే ఉన్నాయన్నారు. దాంతో యువరాజు చిట్టా అంతా ఉందన్నారు. ఈ కేసులో నన్ను ఇరికిస్తే, నిన్ను పబ్ కేసులో ఇరికిస్త అని బెదిరిస్తున్నారని సీఐ అంటున్నట్లు సమాచారం అన్నారు. పోలీస్ అత్యాచారం చేస్తే ఈ వ్యవస్థ పట్టుకోలేక పోతుందన్నారు. విమలక్క పై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు పెట్టే దైర్యం కూడా చేయలేదన్నారు. తెలంగాణ వచ్చాక విమలక్క మీద కేసులు పెట్టారఅన్నారు. విమలక్క పాటల మీద ఉద్యమం చేసి, ఆమెనే అణచివేశారన్నారు. తెలంగాణ ప్రజల అవేదన అర్దం చేసుకుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చినా అధికారం రాదని ఆంధ్ర నాయకులు అన్నారని, వాళ్ళ మాటలు నిజం చేయడం కాదన్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ కి విజ్ఞత చూపించుకోవలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండని కోరారు. పోడు భూముల సాగు చేసుకునే వారికి న్యాయం చేస్తా అని చెప్పిన కెసిఆర్ మాట మర్చిపోయారన్నారు. తెలంగాణ పోలీసులు అడ బిడ్డల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారన్నారు. పట్టాలిస్త అన్నది నువ్వే, ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నదే నువ్వే అని సీఎం కెసిఆర్ ను విమర్శించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

Leave a Reply