సీఎం కేసీఆర్ మరో ప్రస్థానానికి నాంది పలికారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భూమి పూజలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య భూమి పూజ నిర్వహించారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. రెండు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు కొత్త శకాన్ని ఆరంభించనున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుకు శంకుస్థాన కార్యాక్రమానికి ముందు మహాహోమం నిర్వహించారు. దీనిలో భాగంగా భూదేవతకు పూజలు ప్రారంభించారు. నిర్మాణ స్థలంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు, మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.