Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌పై ప్రజావిశ్వాసం కోల్పాయారు

  • డబ్బును కాదని హుజురాబాద్‌ ‌ప్రజలు చైతన్యాన్ని చాటారు  
  • దళితబంధును కూడా ప్రజలు నమ్మలేదు
  • ఈటల రాజేందర్‌కు ప్రజలు పట్టం కట్టారు
  • బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ ‌కౌంటింగ్‌ ‌జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..ఎవరేమి కామెంట్స్ ‌చేసినా.. ఈటల రాజేందర్‌ ‌బీజేపీ అభ్యర్థి అని స్పష్టం చేశారు.  హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలవబోతున్నారని తెలిపారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలుపు ఊహించినదే అని అన్నారు. హావి•లు అమలు చేయటంలో కేసీఆర్‌ ‌విఫలమయ్యారన్నారు. ఈటల రాజేందర్‌ ‌మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని తెలిపారు. వోటర్లను టీఆర్‌ఎస్‌ ‌భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్‌ ‌ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్‌ఎస్‌తో విరోచిత పోరాటం చేసిన బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్‌ ‌హ్యాట్సాఫ్‌ ‌తెలిపారు.

కెసిఆర్‌ ‌దళితబంధును ప్రజలు నమ్మలేదన్నారు. ఎందుకంటే గతంలో మూడెకరాల భూమి హావి•ని, దళిత ముఖ్యమంత్రి హావి•ని కెసిఆర్‌ ‌తుంగలో తొక్కారని అన్నారు. ఇకపోతే హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్ళిందని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు. మంగళవారం ఆమె వి•డియాతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ ‌పతనం ప్రారంభమైందని… అందుకు హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలిపారు. ఆత్మగౌరవం విజయం సాధించిందన్నారు. దళితబంధు పథకం లాంచ్‌ ‌చేసిన గ్రామంలో బీజేపీ ముందంజలో ఉందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని టీఆర్‌ఎస్‌ ‌కోల్పోయిందని డీకే అన్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్‌ ‌కుటుంబం కోల్పోయిందన్నారు. వేలకోట్ల పథకాలకు జీఓలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని తెలిపారు. 6 వేల నుంచి 10 వేలు పెట్టి ఓట్లు కొన్నా లాభం లేకుండా పోయిందని విమర్శించారు.

డబ్బులు పంచి ఓట్లు కొనాలని అనుకున్నా… హుజూరాబాద్‌ ‌ప్రజలు ఆత్మగౌరవం వైపే నిలబడ్డారని… హుజురాబాద్‌ ‌ప్రజలకు నా సెల్యూట్‌‘ అని అన్నారు. అధికార యంత్రాంగాన్ని అంతా కూడా రంగంలోకి దింపినా ఫలితం లేదన్నారు. హుజూరాబాద్‌ ‌ప్రజల తీర్పు చారిత్రాత్మకమైందని చెప్పారు. హుజూరాబాద్‌ ‌తీర్పు ఒక కనువిప్పన్నారు. అభ్యర్థి ఎవరో తెలియనట్లుగా కేసీఆర్‌ ‌రంగంలోకి దిగారని… కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఓడించారని అన్నారు. తెలంగాణ మొత్తం హుజూరాబాద్‌ ‌తీర్పును కోరుకుంటుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు.

Leave a Reply