Take a fresh look at your lifestyle.

‌ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న కెసిఆర్‌

KCR is mocking democracy Dhudhilla Sridhar Babu
‌రాచరిక పాలనకు చరమగీతం పాడాలి : మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

పెద్దపల్లి: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ప్రచార్భాటాల్లో మునిగితెలుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న కెసిఆర్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పెద్దపల్లి మున్సిపల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతు అధికార బలంతో ప్రజా సంక్షేమపథకాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తు రాచరికపాలన కొనసాగిస్తున్న కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్పాలన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వాగ్దానం చేసిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌లు తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది లబ్ధిదారులకు ఇచ్చారో చెప్పాలన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌హామీతోనే ఎన్నికల్లో గెలిచి కెసిఆర్‌ ‌సిఎం ఫీఠం ఎక్కారన్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు గడుతుస్తున్న డబుల్‌ ‌బెడ్‌రూమ్‌లకు దిక్కులేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 57సంవత్సరాలకే పెన్షన్‌ ఇస్తానన్న సిఎం కెసిఆర్‌ ‌రెండోసారి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన దిక్కులేదన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతీ హామీ ఇస్తే, దానికి పోటీగా సిఎం కెసిఆర్‌ ‌నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల రూ.3016 ఇస్తానని హామీ ఇచ్చిన ఇప్పటికి వరకు ఎవరికి ఇవ్వలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరిగ్గా ఎన్నికలకు వారం రోజుల ముందు రైతులకు రైతుబంధు పథకం డబ్బులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మొన్నటి హుజుర్‌నగర్‌ ఉపఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సిఎం కెసిఆర్‌ ‌కేవలం హుజుర్‌నగర్‌ ‌నియోజకవర్గంలోని రైతులకు మాత్రమే రైతుబంధు పథకం డబ్బులు ఇచ్చారన్నారు.

కెసిఆర్‌ ‌రెండోసారి సిఎంగా పీఠం అధిష్టించి సంవత్సరం గడుస్తున్నా రైతులకు రైతుబంధు పథకం డబ్బులు దిక్కులేదన్నారు. రాష్ట్రంలో ఇక ఎన్నికలు లేవు కాబట్టే రైతు బంధు పథకం డబ్బులు రైతులకు రావడం లేదని శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. గత కొన్ని సంవత్సరాలు ఆరోగ్యశ్రీ పథకానికి తగినన్ని నిధులు మంజూరు చేయకపొవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద ప్రజలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌పార్టీలు రెండు తోడు దొంగలేనని ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టడం వారికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తలు, నాయకులు రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పీఠం దక్కించుకోవాలన్నారు. పార్టీని నమ్ముకొని పార్టీ అభివృద్ది కోసం ప్రజాసంక్షేమానికి ప్రజల కొరకు కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కుతుందని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తల మధ్య చిన్న చిన్న స్పర్థలు ఉన్నప్పటి కి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల ఇంఛార్జ్ ‌బట్టి శ్రీనివాస్‌, ‌మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి కార్యదర్శి చింతకుంట విజయరమణారావు, డిసిసి అధ్యక్షుడు కొమురయ్య, నాయకులు గంట రాములు, సత్యనారాయణ రెడ్డి, వేముల రాంమూర్తి, కొండల్‌ ‌రెడ్డి, రాములు, హాజీ, ఈర్ల స్వరూప, అక్బర్‌ ఆలీ, రఫీకుల్లాఖాన్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: bjp and trs party, Former Minister, Manthani MLA, Dudhilla Sridhar Babu

Leave a Reply