Take a fresh look at your lifestyle.

ఉద్యమ నేతలను తప్పించే పనిలో కెసిఆర్‌

  • భజన బ్యాచ్‌తో పాలన చేయాలని ప్లాన్‌
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి

మంత్రి ఈటల రాజేందర్‌ ‌దూకుడుకి సీఎం కేసీఆర్‌ ‌తట్టుకోలేక పోయారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కావాలనే ఓ పథకం ప్రకారం ఉద్యమనేతలను కెసిఆర్‌ ‌తప్పించే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. ఈటెలతో పాటు కెటిఆర్‌ ‌సహా అనేకుల భూ కబ్జాలపై విచారణ చేయాలన్నారు.  శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ని సీఎం చేసేందుకు కేసీఆర్‌ ఈటలను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఎదిరించే వాళ్లు ఉండకూడదని కేసీఆర్‌ ‌కుట్ర పన్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కి మొదటి నుంచి మంత్రి హరీష్‌రావుతో పాటు ఈటల అండగా ఉన్నారన్నారు. కేసీఆర్‌ ‌కావాలని కుట్ర చేసి ఈటలను బయటకు పంపుతున్నారని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఈటల రాజేందర్‌  ‌స్వయం కృషితో ఎదిగారన్నారు. ఎర్రవల్లిలో సీఎం వ్యవసాయ క్షేత్రం కోసం భూములు గుంజుకొలేదా..? అని ప్రశ్నించారు. ధరణిలో ముఖ్యమంత్రి భూములు కనిపించవని జీవన్‌రెడ్డి చెప్పారు. విచారణ ఈటల వి•ద కాదు… కేసీఆర్‌ ‌కుటుంబం వి•ద జరగాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. కేటీఆర్‌, ‌సంతోష్‌ ఆస్తుల వి•ద విచారణ జరిపించాలన్నారు.

కేసీఆర్‌కి రాజకీయంగా ఇబ్బందనే ఈటల రాజేందర్‌కు క్లళెం వేయాలని అనుకున్నారని జీవన్‌రెడ్డి  చెప్పారు. విచారణ అధికారి రిపోర్టుని ప్రభుత్వానికి కాకుండా ముందుగా అనుకూల వి•డియాకి ఇస్తున్నారని  జీవన్‌రెడ్డి మండిపడ్డారు. జన్వాడ కేటీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌ ‌భూములపై విచారణ వేయాలని డిమాండ్‌ ‌చేశారు. మంత్రి మల్లారెడ్డి భూ దందాపై దమ్ముంటే విచారణ చేయాలన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువులు కబ్జా చేస్తే పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి పట్టాగా మార్పు జరగడానికి అవకాశం లేదన్నారు. సెంట్‌ ‌భూమి కూడా ఆక్రమించినా విచారణకి సిద్ధమని ఈటల రాజేందర్‌ ‌బహిరంగంగా చెప్పారన్నారు. ఈటల రాజేందర్‌ ‌పదవి కోసం వెంపర్లాడే వ్యక్తి కాదని జీవన్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన వ్యక్తి ఈటల అన్నారు. పీపుల్స్ ‌వాయిస్‌ ‌వినిపించిన వ్యక్తి ఈటల రాజేందర్‌ అని చెప్పారు. ఉద్యమ తెలంగాణ బ్యాచ్‌ ‌కాబట్టి ఈటల రాజేందర్‌ ‌పోరాటం చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ బ్యాచ్‌ ‌లెక్క కేసీఆర్‌కి భజన కొట్టలేదని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Leave a Reply