Take a fresh look at your lifestyle.

రైతును నట్టేట ముంచుతున్న కెసిఆర్‌

  • రైతుబంధు పేరుతో అన్నీ బంద్‌ ‌చేసే యత్నాలు
  • కేంద్రం వరి కొనబోమని ఎక్కడ చెప్పిందో చెప్పాలి
  • ఉప్పుడు బియ్యానికి ధాన్యానికి తేడా లేదా?
  • కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బండి సంజయ్‌
  • ‌పార్టీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన బండి

సిఎం కేసీఆర్‌ ‌డొల్లతనం బయటపడిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ధాన్యం గురించి ప్రశ్నిస్తే పారబాయిల్డ్ ‌రైస్‌ ‌లేఖను టీఆర్‌ఎస్‌ ‌రిలీజ్‌ ‌చేసిందన్నారు. ధాన్యం కొనమని..టీఆర్‌ఎస్‌ ‌రిలీజ్‌ ‌చేసిన లేఖలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ధాన్యం గురించి తాను మాట్లాడితే ఉప్పుడు బియ్యం గురించిన లేఖను రిలీజ్‌ ‌చేశారని చెప్పారు. రైస్‌ ఎం‌త ఇచ్చినా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కొందరు పారాబాయిల్డ్ ‌రైస్‌ ‌మిల్లర్లతో కుమ్మక్కు అయి కేసీఆర్‌ ఉప్పు‌డు బియ్యం కొనాల్సిందే అని కేంద్రాన్ని బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో బండి సంజయ్‌ ‌దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. రైతుకు, ఉప్పుడు బియ్యానికి సంబంధం లేదని మరోసారి గుర్తు చేశారని చెప్పారు.

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌విసురుతూ.. ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం రాసిన లేఖను సాయంత్రం 5 గంటల లోపు బహిర్గతం చేయాలని, లేకుంటే కేసీఆర్‌ ‌రాజీనామా చేయాలని  డిమాండ్‌ ‌చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్‌ ‌లేఖ రాస్తే..కేంద్రాన్ని తాము ఒప్పిస్తామని చెప్పారు. రైతుల పాలిట కేసీఆర్‌ ‌రాబందుగా మారారని ద్వజమెత్తారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన మంత్రులపై చర్యలకు ఈసీని కోరతామని తెలిపారు. కోర్టులను ధిక్కరించే వ్యాఖ్యలు చేసిన కలెక్టర్‌పై న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో పండిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. అన్నీ కేంద్రమే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. వరి కాకుండా ఏ పంట పండించాలో ప్రభుత్వం దగ్గర ప్రణాళిక లేదని తప్పుబట్టారు. వరి పంట వేయకుంటే లక్షల కోట్ల కాళేశ్వరం ప్రాజక్ట్ ఎం‌దుకని ప్రశ్నించారు. రైతుబంధు ఇచ్చి..కేసీఆర్‌ అన్నీ బంద్‌ ‌చేస్తున్నారని బండి సంజయ్‌ ‌దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ ‌రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారా? తెరాస ప్రభుత్వం కర్షకులను ఆదుకుందా? రాష్ట్రంలో ఆకలి చావులు చోటు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి కేంద్రానికి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం మాత్రమే చేయాలి. మిగతాది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోందని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply