Take a fresh look at your lifestyle.

గత నెల చివర వారం నుంచి కేసీఆర్ కనిపించడం లేదు..!

టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి
 ప్రజలకు దూరంగా ఉండే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఆచూకీ కూడా  లభ్యం కావడం లేదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి విమర్శించారు.గత నెల చివర వారం నుంచి ఆయన కనిపించడం లేదన్నారు.బుధవారం ఆయన గాంధీభవన్ లో మీడియా తో మాట్లాడుతూ …ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడ్డారని, అందువల్లనే వ్యక్తిగత నిర్బంధంలోకి వెళ్లారన్న వార్తలు వస్తున్నాయని అసలు ముఖ్యమంత్రి ఏమయ్యాడన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయన్నారు.తక్షణమే సీఎం అజ్ఞాతం వీడి తన ఆరోగ్యంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.స్వయాన ప్రభుత్వ పెద్దలే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.కార్పోరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన హోంమంత్రి మహమూద్ అలీ అబద్దాలు కోరని మండిపడ్డారు.తులసి ఆకులతో తాను కరోనా నుంచి బయట పడ్డానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు .ప్రతి రోజు కరోనా కేసులు పెరుగుతున్నందున పాజిటివ్‌ వచ్చిన వారు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ప్రైవేట్  ఆస్పత్రులకెళ్లితే భారీ ఎత్తున బిల్లులు వేస్తుండడంతో భరించలేకపోతున్నారని అన్నారు.

ప్రయివేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని .ప్రభుత్వ జీవోను లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాత సచివాలయాన్ని మెరుపు వేగంతో కూల్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.రోగనిరోధక శక్తిని మెరుగుపరచమని ప్రజల్లో ప్రభుత్వం అవగాహన కల్పించాల్సి ఉందని రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు ప్రజలు నిమ్మజాతి పండ్లను, ప్రొటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు .

Leave a Reply