- ఇప్పుడు దేశాన్ని ఎలా ఉద్దరిస్తారో చెప్పాలి
- నిరంతర విద్యుత, ప్రాజెక్టులు వస్తే బోర్ల సంఖ్య ఎలా పెరిగింది
- ఆదాయం పెరుగుతూ వస్తున్నా ఎక్కడికి పోతోంది
- ఎపిని, వారి సంస్కతిని విమర్శించిన సంగతి కెసిఆర్ మరిచారా
- డియా సమావేశంలో మండిపడ్డ బండి సంజయ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
నిరుద్యోగుల నోరు మూయించేం దుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్కు జాతీయాధ్యక్షుడే లేడని.. అటువంటిది ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని సంజయ్ ప్రశ్నించారు. ఏపీకి క్యాబ్‌లను పంపించి.. బీఆర్ఎస్లో చేరేందుకు నేతలను పిలిపించుకున్నారని ఆరోపించారు. గతంలో ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ అభివృద్ధికి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ వ్యాపారులు ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసిండన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. 24 గంటల కరెంట్ రాష్ట్రంలో ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలన్నారు. డిస్కంలు 60వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని చెప్పారు.
పొలం దగ్గర ఫ్రీ కరెంట్ ఇస్తూ..ఇంటి దగ్గర ఛార్జీ మోత మోగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అంత చీటింగ్ తెలివి ఎవరికి లేదని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తీరుతో కృష్ణ జలాల్లో వాటా కోల్పోయామన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్టాన్న్రి తీసుకొచ్చారని విమర్శించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని బండి సంజయ్ తెలిపారు. పాఠశాల విద్యలో చివరి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు 17శాతం పెరగినట్లు తెలిపారు. నోటిఫికేషన్ల పేరు చెప్పి కోచింగ్ సెంటర్లకు దోచిపెడుతు న్నాడని ఆరోపించారు. భారత్‌లో భారత్ బజార్ ఉంటదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏపీ నేతలు బీఆర్ఎస్ చేరిక సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. భారత్‌లో చైనా బజార్లు తప్ప భారత్ బజార్లు ఎలా ఉంటాయని అన్నారు. అలా అయితే తెలంగాణలో తెలంగాణ బజార్ ఉందా అని అడిగారు. మైసూర్ పాక్ అంటే మైసూర్లో తయారు చేస్తారా.. ఇరానీ చాయ్ ఇరాన్లో తయాచేస్తారా అన్నారు. కరోనా సమయంలో మిగితా దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత భారత్‌ది అని సంజయ్ చెప్పారు.
ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. ఇవన్నీ కేసీఆర్ జిమ్మిక్కులని విమర్శించారు. కేసీఆర్ పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ అని.. కేసీఆర్ అంత చీటింగ్ తెలివి ఎవరికి ఉండదన్నారు. టీఆర్ఎస్ పేరు మార్పుతో తెలంగాణతో ఉన్న బంధం తెగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గతంలో ఏపీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ అభివృద్ధికి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అప్పట్లో ఏపీ వాళ్లు తయారు చేసిన బిర్యానిని పెండ బిర్యాని అన్నారన్నారు. వారి ఉలవచారును తెలంగాణలోని ఎడ్లు, బర్లు తింటాయన్నారని చెప్పారు. కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. డియా సమావేశంలో రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు.