Take a fresh look at your lifestyle.

పోతిరెడ్డిపాడుకు కెసిఆర్‌ ‌నైతిక బాధ్యత వహించాలి

  • కెసిఆర్‌ ‌మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది – లాక్‌డౌన్‌ ‌సమయంలో 21వేల కోట్ల టెండర్లా
  • మండిపడ్డ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  –  పోతి•రెడ్డిపాడుతో దక్షిణతెలంగాణ ఎడారే అన్న కోమటిరెడ్డి

పోతిరెడ్డిపాడు పనులు మొదలైన రోజు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్‌ ‌రాజీనామా చేయాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్‌ ‌మొదటి నుంచి మాట్లాడుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌మాత్రం మౌనంగా ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు.. కేసీఆర్‌ ‌తోనే మాట్లాడిన తర్వాతనే పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపు సామర్ద్యాన్ని పెంచుతూ జీవో ఇచ్చినట్లు మంత్రులు చెబుతున్నా రన్నారు. గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నుంచి ఏపీకి 44 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకెళ్లినప్పుడే ఆందోళన చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఇఎన్‌సి మురళీధర్‌ ‌రావు 2011 లో రిటైర్మెంట్‌ అయ్యారు. అయినా ప్రస్తుతం కాంట్రక్టు ఇన్‌సిగా కొనసాగుతున్న ఆయన..వేల కోట్ల టెండర్లలో ఎలా పాల్గొంటాడని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టులో 2టిఎంసిల నుంచి
ఒక్క టిఎంసికి ఎలా తగ్గిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీధర్‌ ‌రావు పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే మురళీధర్‌ ‌రావు పని చేస్తున్నాడని అనుకోవాల్సి వస్తుందన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే తమ్మిడి హెట్టిని వదిలిపెట్టి కషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌ను కడుతున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో 21 వేల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ ఇం‌దులో 8శాతం పర్సెంట్‌ ‌కోసం ఈ టెండర్లు పిలిచారన్నారు. 2టిఎంసిల కోసం ప్రజల పన్నుల సొమ్మును లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పోతిరెడ్డిపాడుపై ఎలాంటి పోరాటంకైనా సిద్ధమన్న ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి..ఛలో పోతిరెడ్డిపాడుకు కూడా పిలుపు నిస్తామని తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు..ప్రధాని మోడీని కూడా కలుస్తామన్నారు. ఇదిలావుంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఏపీ తీసుకోచ్చిన జీవో 203 అమలు కాకుండా చూడాలని డిమాండ్‌ ‌చేస్తూ సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోతిరెడ్డి పాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌ ‌నుంచి 6 నుంచి 8 టీఎంసీల నీటిని తరలించుకు పోయేందకు ఏపీ ప్రయత్నిస్తోందని, అదే జరిగితే దక్షిణ తెలంగాణ ఏడారి అవుతోందని వెంకట్‌ ‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, డిండి, శ్రీశైలం లెప్ట్ ‌బ్యాంక్‌ ‌కెనాల్‌ ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నీటి కరువు ఏర్పడుతోందన్నారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అమలైతే నాగర్జునసాగర్‌ ‌కు చుక్క నీరు రాదని, ఆయకట్టు రైతులు సాగు నీటికి, ప్రజలు తాగు నీటికి ఇబ్బందులు పడతారని ఎంపీ తెలిపారు. జంటనగరాలు దాహర్తితో అల్లాడే ప్రమాదం ఉందన్నారు. తక్షణం పోతిరెడ్డి పాడు పనులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కు రాసిన లేఖలో తెలిపారు. కృష్ణ బేసిన్‌ ‌లోని తెలంగాణ ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా నిధులు కేటాయించాలని, లేని పక్షంలో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్‌ ‌పెరిగే అవకాశం ఉందన్నారు. పోతిరెడ్డి పాడు విస్తరణ పనులు జరిగితే సీఎం కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు వెంకట్‌ ‌రెడ్డి. చలో పోతిరెడ్డి పాడు కార్యక్రమం నిర్వహించి కేసీఆర్‌ ‌విధానాన్ని ఎండగడుతామన్నారు. పోతిరెడ్డి పాడు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు.

Leave a Reply