Take a fresh look at your lifestyle.

కట్టడి చేయడంలో.. కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌విఫలం

  • కొరోనాని ఆరోగ్య శ్రీలో చేర్చాలి
  • వైరస్‌తో చనిపోయిన వారికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
  • ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌చనిపోతే 50 లక్షలు ఇవ్వాలి : పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి

కొరొనా వ్యాధి కట్టడిలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అనాలోచిత మాటలు మాట్లాడారని గుర్తు చేశారు. ‘స్పీక్‌ అప్‌ ‌తెలంగాణ’ పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీ డిజిటల్‌ ఉద్యమం నిర్వహించింది. ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విటర్‌, ‌యూట్యూబ్‌, ఇం‌స్టాగ్రామ్‌ ‌లాంటి మాధ్యమాల్లో పలు డిమాండ్లు చేస్తూ ప్రభుత్వంపై నేతలై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఫేస్‌ ‌బుక్‌ ‌లైవ్‌లో మాట్లాడుతూ … మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కొరొనా విషయంలో టీఆరెస్‌ ‌ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం కొరొనా వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, తెల్లరేషన్‌ ‌కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి కొరొనా చికిత్స ప్రభుత్వ-ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో ఫ్రీ ట్రీట్మెంట్‌ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అలాగే ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో కొరొనా వ్యాధి చికిత్సకు లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో బిల్లుల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు 2లక్షల టెస్టులు మాత్రమే చేశారని, కొరొనా టెస్టుల సంఖ్యను వెంటనే పెంచాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. జిల్లాల్లో కొరొనా మరణాల లెక్కలు తారుమారు అవుతున్నాయని విమర్శించారు. కొరొనా వ్యాధి గస్తులకు ఆక్సిజన్‌ ‌లభించడం లేదని, సరైన వసతులు కల్పించని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్‌దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరొనా మరణాలు ఎక్కువగా పేదల్లోనే ఉన్నాయని, ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి వారికి 10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే కొరొనా ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్ ‌మరణిస్తే వారికి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నాయకులంతా ఇదే డిమాండ్స్ ‌చేస్తూ సోషల్‌ ‌మీడియాలో పోస్ట్ ‌చేశారు. ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌లో ఫీజులను నియంత్రించాలని, యాభై శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని •టల్స్‌లో 50 రూమ్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. వాటిని •మ్‌ ‌క్వారంటైన్‌లుగా మార్చాలన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ ‌టెస్టుల సంఖ్యను పెంచాలని, కోవిడ్‌ ‌మృతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్‌గ్రేషిషియా ఇవ్వాలి. ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్స్‌కు 50 లక్షలు ఎక్స్‌గ్రేషిషియా ఇవ్వాలని, ప్రభుత్వ హాస్పిటల్ల్ ‌వైద్య సౌకర్యాలు పెంచాలి.. ఆక్సిజన్‌, ‌వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని సర్కార్‌ను జగ్గారెడ్డి డిమాండ్‌ ‌చేశారు. అదే విధంగా.. ‘హార్ట్ అటాక్‌ ‌వంటి ఇబ్బందులతో ఆస్పత్రికి వెళ్లిన వారికి కూడా కొరోనా అనుమానంతో వైద్యం చేయడం లేదు. దాంతో కొరోనా యేతర ఆరోగ్య సమస్యలతో వెళుతున్న వారికి వైద్యం సకాలంలో అందక మరణిస్తున్నారు. • •రోనా కు మందు వచ్చే వరకు ప్రజలకు విద్యుత్‌ ‌బిల్లులు రద్దు చేయాలి. కిరాయిదారుల ఇంటి కిరాయిలు ప్రభుత్వమే చెల్లించాలి. ఇంటి పన్నులు పూర్తిగా రద్దు చేయాలి. గాంధీ హాస్పిటల్‌కు 3000కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలి. ప్రజలంతా మరణిస్తే ప్రాజెక్టులు కట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రజల ప్రాణాలు ముఖ్యం’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. స్పీక్‌ ఆఫ్‌ ‌తెలంగాణలో ప్రజలు తమ అనుభవాలను పంచుకోవాలని పిసిసి పిలుపునిచ్చింది.

Leave a Reply