Take a fresh look at your lifestyle.

తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటుకు చొరవ చూపని కేసీఆర్ ప్రభుత్వం.

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: దేశంలో కొత్త‌గా ఎనిమిది సైనిక్ స్కూళ్ళు ఏర్పాటు జరగనుంది అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్ర‌శ్నకి కేంద్రం స‌మాధానంగా కేంద్రం తెలిపింది. దేశంలో మొత్తం 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయని, మరో ఎనిమ‌ది సైనిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్ వెల్ల‌డించారు.

తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క సైనిక్‌ స్కూల్‌ లేకపోవడంతో, వరంగల్‌ జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు రక్షణశాఖ 2017 మార్చి 2న సూత్రప్రాయ ఆమోదం తెలిపింద‌న్నారు. ఆ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ సంబంధిత అధికారుల‌తో ఒప్పందం చేసుకుంద‌న్నారు. అయితే ఈ విషయంలో కేసీర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీ గ‌డ్డం రంజిత్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు.

Leave a Reply