Take a fresh look at your lifestyle.

పెద్దల సభకు కేసీఆర్ ..?

KCR Birthday Celebrations in Jalvihar hyderabad
తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు? ..

చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు 

 ‌తెలంగాణ రాజకీయాల్లో  ప్రస్తుత పరిస్థితులు రాబోయే రోజుల్లో మార్పును సూచిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా  తాను ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని కెసిఆర్‌ ‌చెప్పడం చూస్తే  జాతీయ స్థాయిలో మరో సారి భూమిక పోషించేందుకు సిద్ధమవుతున్నారని సూచిస్తోంది. కెసిఆర్‌ ‌జాతీయ రాజకీయాలకు వెళ్లేందుకు గాను రాజ్యసభ బరిలో నిలుస్తారని పరిశీలకులు అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా కెటిఆర్‌,‌కవితలకు అప్పగించి కేవలం జాతీయరాజకీయాలకు కేసిఆర్‌ ‌పరిమితం అవుతారని అన్నారు. కెసిఆర్‌ ‌జాతీయరాజకీయాలకు వెళితే అక్కడా విజయం సాధిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, మాజీకేంద్రమంత్రి వేణుగోపాలాచారిలు వేర్వేరుగా అభిప్రాయపడ్డారు. కెసిఆర్‌ ‌రాజ్యసభకు వెళితే తప్పేంటని ఎర్రబెల్లి అన్నారు. దేశంలో అభివృద్ధి, అవినీతి నిర్మూలన, యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించడం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం, సుపరిపాలన అందించడం తన వల్లే సాధ్యమవు తుందని  కెసిఆర్‌  ‌బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్‌ ‌మాటలను కొంతమంది సీరియస్‌గా తీసుకోక పోవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక సైద్దాంతిక భూమికను ప్రస్తావిస్తున్నారని, ఆయన తెలంగాణలో అనుసరిస్తున్న ఫార్ములా దేశానికి అనుసరణీయం కాగలదని భావిస్తున్నారు. నదుల అనుసంధానం మొదలు, నీటి పంపకాలు, వ్యవసాయ రంగ ముఖచిత్రం వంటి అంశాలను కెసిఆర్‌ ‌బలంగా
ప్రతిపాదించారు. అందుకే ఇటీవలి ఘఠనల తరవాత రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ఆవశ్యకత ఎక్కువగా ఉన్నదని ఆయన భావిస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. రాజీనామా.. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ ‌సృష్టించిన ట్రెండ్‌ ఇది.. బహుశా తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి తీసుకుని వెళ్లే క్రమంలో ఆయన వేసిన తొలి అడుగు ఇదే. ఆనాడు డిప్యూటి స్పీకర్‌గా ఉన్న కెసిఆర్‌ ఆ ‌పదవికి, సిద్దిపేట శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయి. ఆయన రాజీనామా తెలంగాణ ప్రజల్లో ఉత్తేజం నింపింది. జై కెసిఆర్‌ అన్న నినాదాలకు బీజం వేసింది. అలా మొదలైన ఆయన రాజీనామాల పరంపర ఉద్యమ ప్రస్థానంలో అనేకమార్లు కొనసాగింది. రాజీనామా చేసినప్పుడల్లా ఆయన ఇమేజ్‌ ‌మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. సరిగ్గా ఇప్పుడు అదే జరగనుందని భావిస్తున్నారు. సిఎంగా గజ్వెల్‌ ‌నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న  కెసిఆర్‌ ‌మరోమారు రాజీనామా చేస్తారని అంటున్నారు. అలా రాజీనామా చేసి రాజ్యసభకు వెళితే ఇక్కడి నుంచి ఆయన కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తారన్న ప్రచారం కూడా  ఉంది. గజ్వెల్‌ అయితే సేఫ్‌ ‌ప్లేస్‌గా భావిస్తున్నారు. సిఎం కెటిఆర్‌,‌మంత్రిగా కవితలకు రాష్ట్ర బాధ్యతలను అప్పగించి జాతీయ రాజకీయాలపై కెసిఆర్‌ ‌దృష్టి పెడతారన్న ప్రచారం పార్టీలోనూ ఉంది. వివిధ రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ ‌కన్నా బీజేపీని ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. జార్ఖండ్‌, ‌మహారాష్ట్రలలో ప్రధానంగా ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఢీకొన్నాయి.  పదవులను తృణప్రాయంగా వదిలేసి ప్రజల్లోకి వెళ్లడం…అన్న ట్రెండ్‌ ‌కెసిఆర్‌కు మాత్రమే సాధ్యమయ్యింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించడం కూడా అంతే సులువుగా సాగిపోయింది….ఇప్పుడదే సూత్రంతో కేంద్రా రాజకీయాల్లోకి కెసిఆర్‌ ‌ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తారన్న చర్చ సాగుతోంది. అధికారాన్ని వారసులకు అప్పగించి హస్తినలో చక్రం తిప్పేందుకు ఇప్పటికే వ్యూహం ఖరారు చేసుకున్నారన్న ప్రచారం కూడా ఉంది

Leave a Reply