Take a fresh look at your lifestyle.

సింగరేణిని దోచుకుంటున్న కెసిఆర్‌ ‌కుటుంబం

  • కవిత అక్రమాలకు అడ్డూ అదపు లేకుండా పోయింది
  • అక్రమాలకు సిఎండి శ్రీధర్‌ అం‌డ
  • సిబిఐ విచారణ చేయించి వెలికి తీస్తాం
  • బిసెపి రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌, ‌రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

కోట్ల రూపాయల ఆదాయం గల సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కుటుంబం దోచుకుంందని బీజేపీ ఇన్‌ఛార్జ్ ‌తరుణ్‌చుగ్‌ ‌తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సింగరేణిలో పెత్తనం చలాయిస్తూ అధికారులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని తరుణ్‌చుగ్‌ ‌పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్‌లో పర్యటించిన ఆయన..అక్కడి కార్మికులతో మాట్లాడారు. అనంతరం మిడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌, ‌కవితపై విమర్శలు గుప్పించారు. సింగరేణికి కవిత యూనియన్‌ ‌లీడర్‌గా మారి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మికులు, కార్మిక నేతలపై ఆధిపత్యం చేలాయిస్తున్నారని మండిపడ్డారు.

సింగరేణి అవినీతికి అడ్డాగా మారిందన్నారు. సింగరేణిలో అవినీతిని చూస్తూ ఊరుకోమన్నారు. సింగరేణి సీఎండీ సరిగా పనిచేయడం లేదని, టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. కాగా రాష్ట్రంలో విస్తరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి తరుణ్‌చుగ్‌ ‌రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అధికార పార్టీయే లక్ష్యంగా పెట్టుకుని విమర్శలు సందిస్తున్నారు. కుమ్రంభీమ్‌ ‌జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన చత్రపతి శివాజీ సంకల్ప సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ ‌పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌హజరయ్యారు. వీరి సమక్షంలో సిర్పూర్‌ ‌నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌పాల్వాయి హరీష్‌ ‌బాబు పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్‌ ఆయనకు బీజేపీ కండువా కప్పి పాల్వాయి హరీష్‌ ‌బాబు, అయన అనుచరులను పార్టీలోకి అహ్వనించారు.

ఈ సభకు పాల్వాయి అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తరుణ్‌ ‌చుగ్‌ ‌మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నాయకత్వంలో బీజేపీ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలపడుతుందని అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం నేరస్తులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌పాలనలో నేరస్తులు నేరం చేసి స్వేచ్ఛగా సమాజంలో నలుమూలల తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతుందని అన్నారు. రాష్ట్ర పోలీసులు… ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలవొంచి నేరస్తులను కాపాడుతున్నరని ఆరోపించారు. రాక్షస పాలన నుండి త్వరలోనే తెలంగాణ ప్రజలకు బీజేపీ విముక్తి కలిగిస్తుందని తరుణ్‌ ‌చుగ్‌ ‌తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఫైనాన్స్ ‌సోర్స్‌గా సింగరేణి మారిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. సింగరేణి సొమ్మును కేసిఆర్‌ అ‌క్రమంగా వాడుకుంటున్నాడన్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్‌ అవినీతి మిద విచారణ జరపించి జైలుకు పంపిస్తామన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వి•టింగులకు, కేసీఆర్‌ ‌మందుకు, సోడా, చికెన్‌ ‌స్టఫ్‌కు కూడా సింగరేణి పైసలే పెడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామిలు అమలు చేయలేదన్నారు. సింగరేణి సిఎండి..కేసీఆర్‌ ‌చెప్పుచేతుల్లో పనిచేస్తున్నాడని. అయన ఐఎఎస్‌ ‌కాదు అయ్యా ఎస్‌ అం‌టున్నారన్నారు. సింగరేణిలో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, వొచ్చే ఎన్నికల్లో సింగరేణి గడ్డపై కాషాయ జెండా ఎగురేస్తామన్నారు. కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ‌కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. పాల్వాయ్‌ ‌పురుషోత్తం వారసుడిగా ఆయన తనయుడు హరీష్‌ ‌పార్టీలో చేరారని అన్నారు.

ఆయనకు స్వాగతం పలుకుతున్నామని అన్నారు. పోరాటాల పురిగిగడ్డ ఆదిలాబాద్‌ అన్నారు. త్వరలో జరిగే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని బీజేపీ నేత వివేక్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర్‌ ‌ప్రాజెక్టుతో జగన్‌ ‌జల దోపిడీ చేస్తుంటే, కేసీఆర్‌ ‌ఫామ్‌హౌజ్‌లో పడుకుంటున్నాడని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో నిధులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు, మేఘా కృష్ణారెడ్డికి ఇస్తున్నాడని వివేక్‌ ఆరోపించారు. పేద ప్రజలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ఇవ్వడం లేదని, కానీ కొడుకు, బిడ్డలకు ఫామ్‌హౌజ్‌లు కట్టిస్తున్నాడని ఆయన ఆరోపించారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

పోలీస్‌ ‌వ్యవస్థకు గులాబీ కండువా వేశారని, పోలీస్‌ ‌విలువలను దిగజార్చారని ఆయన విమర్శించారు. ప్రాణహిత చేవెళ్లను కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు. ఏపీ 60 టీఎంసీల నీళ్లు దోచుకుంటున్నా నోరు మెదపడం లేదన్నారు. దేశంలో అవినీతిలో నెంబర్‌ ‌వన్‌ ‌సీఎం కేసీఆర్‌..అని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. దుబ్బాక, జిహెచ్‌ఎం‌సి తరహాలోనే నాగార్జున సాగర్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌ను ఓడించి కేసీఆర్‌ ‌చెంప చెల్లుమనిపించాలని అన్నారు. పోలీస్‌ ‌వ్యవస్థను పూర్తిగా కూల్చేసిన ఘనత కేసీఆర్‌ ‌దేనన్నారు. కాగజ్‌ ‌నగర్‌ ‌సభకు భారీగా ప్రజలు తరలివొచ్చారు.

Leave a Reply