Take a fresh look at your lifestyle.

బడుగు, బలహీనర వర్గాలను పట్టించుకోని కెసిఆర్‌

  • రాష్ట్ర ఆకాంక్షలకు భిన్నంగా దుర్మార్గపు పాలన
  • తెలంగాణ ఏర్పాటులో బిజెపిదే ప్రధాన పాత్ర
  • ఎన్నికలు రాగానే దళితులు గుర్తుకు వొస్తరు
  • పథకాలతో కెసిఆర్‌ ‌మొసలి కన్నీరు
  • బడుగుల ఆత్మగౌరవ పోరులో మాట్లాడిన బండి సంజయ్‌
  • ‌హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బుద్ది చెప్పాలని నేతల పిలుపు

రాష్ట్ర ఆకాంక్షలను పక్కన పెట్టి సిఎం కెసిఆర్‌ ‌తన సొంత పద్దతిలో రాజకీయ లబ్ది కోసమే పాలన చేస్తున్నారని, ప్రజల ఆకాంక్షలను వాగ్దానాలను మరిచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఇచ్చిన బిజెపి ఇప్పుడు కెసిఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పోరాడుతుందని, తెలంగాణ ఆకాంక్షల కోసం రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. హైదరాబాద్‌ ‌నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ప్రగతి భవనాన్ని కూల్చి 125 అడుగుల అంబేడ్కర్‌ ‌విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 2023 తర్వాత లక్ష నాగళ్ళతో దున్ని కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ను బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్‌ ‌మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామిలను అమలు చేయిస్తామన్నారు. హుజూరాబాద్‌లో జరుగుతుంది బైపోల్స్ ‌కాదని, కేసీఆర్‌కు బైయింగ్‌ ఎలక్షన్స్ అని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ‌వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేసీఆర్‌ ఇచ్చిన హామిలను అమలు చేయాలని వారు డిమాండ్‌ ‌చేశారు. దళితులకు మూడెకరాల భూమి, గిరిజనుల పోడు భూములకు పట్టాలు, బీసీ సబ్‌ ‌ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు కాదని, రూ. 50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపును సీఎం కేసీఆర్‌ అడ్డుకోలేరన్నారు. కేసీఆర్‌పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై సీఎంకు చితశుద్ది లేదని విమర్శించారు.

పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని, ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల బావమరిది చాటింగ్‌పై విచారణ జరిపించాలని సవాల్‌ ‌చేశారు. నిజంగా ఆయన తప్పు చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోందని బండి సంజయ్‌ ‌స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ‌గెలుపు.. బీజేపీకి భవిష్యత్తుకు నాంది అని డీకే అరుణ అన్నారు. మోసం, అబద్ధాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. బీజేపీ వల్లనే దళితుబంధు పథకం తీసుకువొచ్చారన్నారు. దళితులపై కేసీఆర్‌కు ప్రేముంటే రాష్ట్రమంతటా ఒకేసారి దళితబంధు అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల కోసం ప్రభుత్వ డబ్బును ఖర్చు చేస్తున్న కేసీఆర్‌ను ప్రగతి భవన్‌ ‌నుంచి తరిమికొట్టాలన్నారు. కావాల్సిన వారి కోసమే కోకాపేట భూములు రేట్లు పెంచారని ఆరోపించారు. అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ‌దళితబంధును తీసుకొచ్చారని డీకే అరుణ విమర్శించారు.

నాడు ఎన్టీఆర్‌కు లభించిన ఆదరణే..నేడు బండి సంజయ్‌కీ లభిస్తుందని బీజేపీ నేత స్వామిగౌడ్‌ ‌పేర్కొన్నారు. నేడు ఆయన మిడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలు గుర్తించాలన్నారు. ఆత్మగౌరవం కంటే మించినది జీవితంలో మరొకటి లేదన్నారు. రాళ్లు, తుపాకుల మధ్య బడుగులను కాపాడుకున్న వ్యక్తి బండి సంజయ్‌ అన్నారు. అసైన్డ్ ‌భూమిని రద్దు చేసిన ప్రభుత్వాన్ని ఉరి తీయాలని స్వామిగౌడ్‌ ‌పేర్కొన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌దెబ్బకు కేసీఆరే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వొచ్చిందని బీజేపీ నేత జితేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనటానికి స్వయంగా కేసీఆర్‌ ‌మానిటరింగ్‌ ‌చేయటమే నిదర్శనమన్నారు. బీజేపీలో బడుగులంతా హుజురాబాద్‌ ‌వొచ్చి ప్రచారంలో పాల్గొనాలన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ‌దళితబంధు పథకం తీసుకొచ్చారని జితేందర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ధర్నాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌డీకేఅరుణ, లక్ష్మణ్‌, ఎం‌పీ సోయం బాపురావు, గరికపాటి మోహనరావు, స్వామిగౌడ్‌, ఇం‌ద్రసేనారెడ్డి, ఏ.చంద్రశేఖర్‌, ‌మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు భారీగా బీజేపీ శ్రేణులు హాజరయ్యారు.

Leave a Reply