- పోడు పట్టాలు..12 శాతం రిజర్వేషన్లు..హావి•ల విస్మరణ
- ఎన్నికలుంటేనే ప్రజలు గుర్తుకొస్తారు
- బిజెపి ఎస్టీ మోర్చా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 19 : పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పిన సీఎం కెసిఆర్ హావి•ని విస్మరించరడమే గాకుండా..గిరిజనులను మోసం చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోడు సమస్యలపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆదివాసీలను మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు. అలాగే వారికి 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో భాజపా ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ సమావేశం జరగగా…బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్టీల భూ సమస్యలపై పోరాడినందుకు నల్లగొండ జిల్లా గుర్రంపొడులో ఎస్టీ మోర్చా నేతలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిజెపితోనే గిరిజనులకు మేలు జరుగుతుందని, బిజెపి అధికారంలోకి వొస్తేనే అది సాధ్యమని అన్నారు.
రానున్న ఎన్నికల్లో 12ఎస్టీ నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ 12 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో భాజపా విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఎన్నికల నాడే సీఎం కేసీఆర్కు పోడు భూముల సమస్యలు గుర్తుకు వొస్తాయన్నారు. నాగార్జునసాగర్ ఎన్నికలు, హుజూర్నగర్ ఎన్నికలప్పుడు.. పట్టాలిస్తానని చెప్పారు.
12శాతం రిజర్వేషన్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇంకా ఇవ్వలేదు. పోడుభూములకు పట్టాలు ఇస్తానని చెప్పి సీఎం విస్మరించారని అన్నారు. ముఖ్యమంత్రికి ఓ విధివిధానం లేదు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీమంత్రి రవీంద్రనాయక్, చాడ సురేష్ రెడ్డి, హుస్సేన్ నాయక్, ఎస్టీ నియోజకవర్గాల ఇంఛార్జీలు పాల్గొన్నారు.