Take a fresh look at your lifestyle.

దళితులను మోసం చేసిందే కెసిఆర్‌

  • ‌దళిత ముఖ్యమంత్రి అని మోసం చేయలేదా
  • ఎన్నికల ప్రచారంలో ఈటల విమర్శలు

దళిత బంధును ఎవరో ఆపుతున్నట్టు టీఆర్‌ఎస్‌ ‌నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. దళిబంధును ఇవ్వాలనుకుంటే అమలు చేయవద్దని ఆపారా అని అన్నారు. పథకాన్ని అన్ని ప్రాంతాల్లో ముందు అమలు చేయాలన్నారు. గురువారం కమలాపూర్‌ ‌మండలం మర్రిపల్లిలో ఈటల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మాట తప్పను అన్నారు.. అవసరమైతే తల నరుక్కంటా అన్నారు.. ఎప్పుడూ దళితులను మోసం చేస్తూనే ఉంటాడు కేసీఆర్‌‘ అని వ్యాఖ్యానించారు. దళిత సిఎం అంటూ తానెప్పుడూ మాట తప్పలేదన్నారు. దళితులకు సబ్సీడీ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని.. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ఇవ్వలేదని కేసీఆర్‌ ‌సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. దళితబంధుతో మోసం చేస్తున్నారని ఎవరూ అనట్లే అహో.. ఓహో అంటున్నారని తెలిపారు. దళితులకు తప్పకుండా దళితబంధు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేసినా.. డిమాండ్‌ ‌చేస్తున్నా కూడా అని స్పష్టం చేశారు.

హుజూరాబాద్‌ ‌దెబ్బకే ఫించన్లు, రేషన్‌ ‌కార్డులు, ఇళ్ళస్థలాలు ఉన్నవాళ్ళకీ ఇండ్లు కట్టుకునే జీవో వొస్తున్నాయని అన్నారు. ఎన్నికలు ఉంటేనే హమీలు, చెక్కులు ఇస్తారని.. ఇది కేసీఆర్‌ ‌నైజమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈటలను ఓడగొట్టలనే ఇన్ని హమీలు, ఇన్ని నిధులు ఈ నియోజకవర్గానికి ఇచ్చారని అంతేకానీ..ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదని తెలిపారు. ‘కేసీఆర్‌కు ఎప్పటికీ నేను, నా కొడుకు రాజ్యం.. పాలన ఉండాలనే తపన’ ఉంటుందన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు బిల్లులు, డబ్బులు ఈటల వలనే వొస్తున్నాయని చెప్పారు. 30 తరువాత వీళ్ళ అందరీ బతుకు బజారుపాలే అని.. ఎవరు పట్టించుకోరు వీళ్ళను అని ఈటల రాజేందర్‌ ‌వ్యాఖ్యానించారు.

Leave a Reply