Take a fresh look at your lifestyle.

కృష్ణనీటిపై కేసీఆర్‌ ‌చీకటి ఒప్పందం : సంకినేని

కృష్ణనీటిపై ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌రెడ్డితో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చీకటి ఒప్పందం చేసుకున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరిగే విధంగా కృష్ణ పరివాహక ప్రాంతం నుండి రావాల్సిన నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యూలెటర్‌ ‌గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతానికి పోవాల్సిన కృష్ణ, శ్రీశైలం బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుండి పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యూలెటర్‌ ‌ద్వారా ఆరోజుల్లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అనధికారికంగా శ్రీశైలం ప్రాజెక్టు హెడ్‌ ‌స్టోరేజ్‌ ‌వరకు నీరు పోయే విధంగా హెడ్‌ ‌రెగ్యూలెటర్‌ను పెంచడం జరిగిందని తెలిపారు. నేడు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న ముఖ్య మంత్రి కేసీఆర్‌, ‌మంత్రులు తెలంగాణ ప్రయోజ నాలకు, రైతంగానికి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిందని, అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభు త్వంలో టీఆర్‌ఎస్‌ ‌భాగస్వాములుగా ఉన్న కేసీ ఆర్‌, ఎం‌పిలు, ఎమ్మెల్యేలు రాజీనామాల వరకు వెళ్లారని గుర్తుచేశారు.

నేడు తెలంగాణలో నల్గొం డ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లా రైతంగానికి అన్యాయం జరిగే విధంగా కృష్ణనీటి విషయంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేయడంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం నోరు మెదపడంలేదని అన్నారు. నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి నిర్ణయం తీసుకుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నోరు మెదపకపోవడం చూస్తుంటే ఇది చీకటి ఒప్పంద మని పేర్కొన్నారు. ప్రజాధారణ కోల్పోయిన ముఖ్యమంత్రి అంటే జగన్‌మోహన్‌రెడ్డి అని విమర్శించారు. జగన్‌మోహన్‌ ‌రెడ్డిని రాజకీయం గా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణ రైతంగానికి అన్యాయం జరుగుతున్నా, ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే తెలంగాణ రైతాంగానికి జరిగే అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. ప్రజలంతా పార్టీలకు అతీతంగా నీటి హక్కును కాపాడుట కోసం నిరసన కార్యక్రమానికి మదతు తెలుపాలని పేర్కొన్నారు. మహమ్మారి కరోనా మన దేశంలో చాపక్రింద నీరులా వ్యాప్తిచెందు తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ఏర్పాటుచేశారని అన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు మహబూబ్‌నగర్‌ ‌జిల్లా కొల్లాపూర్‌ ‌నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్తిగా పోటీచేసిన సుధాకర్‌రావు బత్తాయి, మామిడి రైతులకు మద్దతుగా నిలబడ్డందుకు అక్కడి సిఐ దాడిచేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం, తక్షణమే సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!