Take a fresh look at your lifestyle.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ  పై .. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలో చిత్తశుద్ధి ఎంత..?

‘ప్రధాని నరేంద్రమోడీ  ఆనాడు పెద్ద కరెన్సీని రద్దు చేసిన నాటి నుంచి ఇటీవల   జాతీయ పౌర చట్టం – సిఏఏ వరకూ  ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలనూ   మొదట విమర్శించిన  కేసీఆర్ ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు కూడా అదే రీతిలో  యూ టర్న్ తీసుకుంటారేమోనని ఆయన  స్వభావం తెలిసిన వారు అనుమానిస్తున్నారు.  హైదరాబాద్ లో విమర్శలు గుప్పించడం, ఢిల్లీ వెళ్ళగానే యూ టర్న్ తీసుకోవడం ఆయనకు అల వాటే. అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్యాకేజీపై ఆయన చేసిన  విమర్శలు ఎంత సేపు నిలుస్తాయన్న  అనుమానం కలగడం సహజమే..’   

కేసీఆర్ గా చిరపరచితులైన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని తోసిపుచ్చుతూ ఇది వట్టి బోగస్ అని అభివర్ణించారు. ఆ ప్యాకేజీలో ఏమీ లేదనీ,అది వట్టి డొల్ల అనీ, అంకెల గారడీ అని కూడా వ్యాఖ్యానించారు. కోవిడ్-19 ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులను ఆధారంగా తీసుకుని కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలను యాచకులుగా పరిగణిస్తోందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యల్లో చిత్తశుద్ది ఉందా .. వాటికి ఆయన కట్టుబడి ఉంటారా అనే ప్రశ్నలు ఆయన స్వభావం తెలుసుకున్న వారిలో తలెత్తుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోడీ ఆనాడు పెద్ద కరెన్సీని రద్దు చేసిన నాటి నుంచి ఇటీవల జాతీయ పౌర చట్టం – సిఏఏ వరకూ ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలనూ మొదట విమర్శించిన కేసీఆర్ ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడు కూడా అదే రీతిలో యూ టర్న్ తీసుకుంటారేమోనని ఆయన స్వభావం తెలిసిన వారు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో విమర్శలు గుప్పించడం, ఢిల్లీ వెళ్ళగానే యూ టర్న్ తీసుకోవడం ఆయనకు అల వాటే. అందువల్ల ఇప్పుడు కేంద్ర ప్యాకేజీపై ఆయన చేసిన విమర్శలు ఎంత సేపు నిలుస్తాయన్న అనుమానం కలగడం సహజమే. హుస్సేన్ సాగర్ మురికి జలాల్లో స్వచ్చతను వెతకడం లాంటిదే ఇదీనూ..!

కరోనా వైరస్ వల్ల బీజేపీ నాయకత్వం రాజకీయంగా లబ్ది పొందింది. ఇంకా పొందాలని చూస్తోంది. తెలంగాణలో బీజేపీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చు. కాంగ్రెస్ ఆ స్థానాన్ని కోల్పోయినట్టే. బీజేపీ తెలంగాణాలో పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది.అది దానికి రాజకీయ అవసరం. వివిధ అంశాలపై కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ నాయకత్వం చేస్తున్న యత్నాలు చూస్తుంటే స్థానిక నాయకులు పోటీదారులుగా కనిపిస్తున్నది. కేసీఆర్ కేంద్రం తీసుకునే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీ వెళ్ళగానే మాట మారుస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రానికి ఆగ్రహం కలిగించడం ఆయనకు ఇష్టం లేదు. ఆగ్రహంతో ఉన్న బీజేపీ వల్ల తీవ్రమైన ముప్పు ఉందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆచి తూచి అడుగు వేస్తున్నారు. కేంద్రంపై నిప్పులు చెరుగుతూనే ప్రజలను ఊరడించే పని చేస్తున్నారు. కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతున్నప్పటికీ, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కన్నా బాగా పని చేస్తోందని ప్రజలకు చెప్పేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని ప్రజలకు తెలియజేస్తున్నారు. తెలంగాణలోనే కాదు, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ప్యాకేజీని వ్యతిరేకించాలా లేదా అని సందేహిస్తున్నాయి. గడిచిన 50 రోజులలో లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించ లేదు ముఖ్యంగా, సాంఘీక ,ఆర్థిక ఆంశాల్లో తగిన చర్యలు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన వాగ్దానాలనూ, హామీలను అమలు జరపలేదగు. సహకార సమాఖ్య విధానాన్ని పాటించలేదు. ఈ పరిస్థితులలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.

కేంద్రం లాక్ డౌన్ విషయంలో అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలాగే, టెస్టింగ్ కిట్లు, పీపీఈల సరఫరా విషయంలో కేంద్రం అనుసరించిన విధానాలు విమర్శలు పాలయ్యాయి. లాక్ డౌన్ సమయంలో కేంద్రం చాలా నిర్ధాక్షిణ్యంగా, దిశలేని రీతిలో వ్యవహరించిందన్న విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ వైరస్ ను కట్టడి చేయడానికి ప్రతిపక్షాలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయి. ఇప్పటికీ ఇస్తున్నాయి. కేంద్రం మాత్రం ఏక పక్ష ధోరణిలో వ్యవహరిస్తోంది. కేసీఆర్ సీరియస్ గా ఉన్నారా లేదా అనేది అలా ఉంచి ప్రస్తుత పరిస్థితులలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షాలకు ఒక్కొక్క అంశపై కేంద్రం విదానాలపై ప్రశ్నించేందుకు సిద్ధం కావాలని కోరుతూ సందేశం పంపుతున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆయన దారిలోకి వస్తే బీజేపీని నిలువరించేందుకు ఆయన ప్రయత్నాలు ఫలించవచ్చు. ఒక వేళ విఫలమైతే ఆయన వేచి ఉండవచ్చు ఆయన మదిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి..!
– శ్యామ్ ,హైదరాబాద్

 

Leave a Reply